కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఉద్యోగాలకు ముప్పు తీసుకొచ్చింది. ఆర్థిక సమస్యల్నీ మోసుకొచ్చింది. దీంతో డబ్బు కోసం లోన్స్ తీసుకోక తప్పట్లేదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమయంలో ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఆదుకుంటున్నాయి. అంతేకాదు క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు వాటిపై లోన్స్ తీసుకుంటున్నారు. బ్యాంకులో అకౌంట్లు ఉన్నవారికే కాదు క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారికీ బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ హోల్డర్ల క్రెడిట్ లిమిట్, బిల్ పేమెంట్ హిస్టరీ, ఎలా ఖర్చు చేస్తున్నారు, క్రెడిట్ స్కోర్ ఎంత అన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి బ్యాంకులు. మరి మీరు కూడా క్రెడిట్ కార్డులపై లోన్స్ తీసుకోవాలనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.
క్రెడిట్ కార్డులపై మీరు ఎంత కావాలంటే అంత లోన్ తీసుకునే అవకాశం ఉండదు. మీ క్రెడిట్ కార్డుపై ఉన్న లిమిట్ లోపే మీకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ వస్తుంది. మీరు ఎంత లోన్ తీసుకుంటే అంత క్రెడిట్ లిమిట్ బ్లాక్ అవుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.2,00,000 అనుకుందాం. మీరు క్రెడిట్ కార్డుపై ప్రీ అప్రూవ్డ్ లోన్ రూ.1,25,000 తీసుకున్నారు. అంత మొత్తం క్రెడిట్ లిమిట్ బ్లాక్ అవుతుంది. ఇకపై మీ క్రెడిట్ లిమిట్ రూ.75,000 మాత్రమే ఉంటుంది. లోన్ ఈఎంఐ చెల్లించిన ప్రతీసారి లిమిట్ పెరుగుతుంది. అయితే కొందరికి మాత్రం క్రెడిట్ లిమిట్ కన్నా ఎక్కువే లోన్ ఆఫర్ చేస్తాయి బ్యాంకులు. ఇది కస్టమర్ రీపేమెంట్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
క్రెడిట్ కార్డులపై తీసుకునే లోన్లకు వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, మీ ఉద్యోగం, క్రెడిట్ కార్డ్ టైప్ పైన ఆధారపడి ఉంటాయి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల కన్నా క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు ఎక్కువ. క్రెడిట్ కార్డులపై తీసుకునే లోన్ చాలా వేగంగా ప్రాసెస్ అవుతాయి. కొన్ని గంటల్లోపే డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా కస్టమర్ కేర్ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు. ప్రాసెసింగ్ ఫీజు 1.2 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డులపై తీసుకునే లోన్లను 6 నెలల నుంచి 5 ఏళ్ల లోపు చెల్లించాలి. మీరు ఎంత గడువు పెంచుకుంటే అంత వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ క్రెడిట్ కార్డు బిల్లులో కలిపి ఉంటుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే లేట్ పేమెంట్ ఫీజుతో పాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్‌పై లోన్లు సులువుగా తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్లపై ఉండే వడ్డీ రేట్ల కన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అవకాశం ఉంటే క్రెడిట్ కార్డులపై లోన్లు తీసుకోకపోవడమే మంచిది. క్రెడిట్ కార్డు విషయంలో మరిన్ని టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Credit Card: డబ్బులు లేవా? క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టండి ఇలా
Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తున్నారా? ఈ నష్టం తప్పదు
EMI moratorium: ఈఎంఐ మారటోరియం విషయంలో ఈ తప్పు చేయొద్దు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Credit cards, Lockdown, Personal Finance