Coronavirus: వారికి కరోనాతో ప్రమాదం ఉండదట

కరోనా వైరస్‌పై చేస్తున్న పరిశోధనల్లో రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి

news18-telugu
Updated: October 8, 2020, 11:09 AM IST
Coronavirus: వారికి కరోనాతో ప్రమాదం ఉండదట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌పై చేస్తున్న పరిశోధనల్లో రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. సాధారణ జలుబుకు కారణమయ్యే మామూలు కరోనావైరస్‌ల(కోవిడ్-19కు కారణమయ్యే సార్స్ కోవ్ 2 వైరస్ కాకుండా ఇతర కరోనా వైరస్‌ల) బారిన పడి కోలుకున్నవారిలో కోవిడ్19 ఇన్ఫెక్షన్‌ల తీవ్రత తగ్గుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయన బృందంలో భారతీయులు కూడా ఉన్నారు.

-జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. కానీ ఇంతకు ముందు ఇలాంటి నాన్- SARS-CoV-2 కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్నవారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీలు, రోగనిరోధక శక్తి కోవిడ్ -19 సోకకుండా నిరోధించలేవని పరిశోధకులు తేల్చారు.

లక్షణాలు కనిపించవు
SARS-CoV-2తో పోరాడే మానవ రోగనిరోధక వ్యవస్థపై మరిన్ని పరిశోధనలు చేయడానికి తమ అధ్యయనం తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కోవిడ్ -19 వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ‘సాధారణ జలుబును కలుగజేసే కరోనావైరస్ల బారిన పడి కోలుకున్న వ్యక్తులు కోవిడ్19 ఇన్ఫెక్షన్లకు గురైనా, వారిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. వారిలో దీని తీవ్రత కూడా అంతగా ఉండదు’ అని పరిశోధన బృంద సభ్యుడు మనీష్ సాగర్ వెల్లడించారు. ఆయన అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు.

ఇతర కరోనా వైరస్‌లు ఉన్నాయి
కరోనా వైరస్లలో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి SARS-CoV-2. ఇది కోవిడ్19కు కారణమవుతుంది. ఇప్పటి వరకు కనుగొన్న కరోనా వైరస్లలో ఇదే కొత్తది. ఇతర కరోనా వైరస్లు మనుషుల్లో జలుబు, న్యుమోనియాకు కారణమవుతాయి. వీటి జన్యుక్రమం SARS-CoV-2 జన్యుక్రమాన్ని పోలి ఉంటుంది. పాత కరోనా వైరస్లకు గురైన వారిలో సాధారణంగా రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఇదే SARS-CoV-2 ప్రభావాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనం తెలిపింది.

 పరిశోధనలు ఎలా చేశారు?గతంలో శ్వసకోశ సమస్యల బారిన పడినవారి చికిత్సకు సంబంధించిన వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. 2015 మే 18 నుంచి మార్చి 11, 2020 మధ్య రెస్పిరేటరీ ప్యానెల్ టెస్ట్ (సీఆర్పీ-పీసీఆర్)లు చేయించుకున్న వ్యక్తుల నుంచి ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ డేటాను పరిశీలించారు. CRP-PCR టెస్ట్లో సాధారణ జలుబును వ్యాపించే కరోనావైరస్లతోపాలు ఇతర శ్వాసకోశ వ్యాధికారకాలు బయటపడతాయి. దీంతోపాటు మార్చి 12,2020 నుంచి జూన్ 12, 2020 మధ్య SARS-CoV-2 బారిన పడిన వ్యక్తుల డేటాను కూడా వారు విశ్లేషించారు.

 వైరస్ వ్యాప్తిని నిరోధించలేదు
వయస్సు, జెండర్, బాడీ మాస్ ఇండెక్స్ వారీగా అందరి డేటాను విడివిడిగా నమోదు చేశారు. గతంలో CRP-PCRటెస్ట్లో సాధారణ కరోనా బారిన పడి, ప్రస్తుతం కోవిడ్ -19 సోకిన వారి మెడికల్ డేటాను విశ్లేషించారు. వీరికి వెంటిలేషన్, ఐసీయూ చికిత్సలు అవసరం లేకుండానే కోలుకున్నారని పరిశోధకులు గుర్తించారు. ఇతర శ్వాసకోశ వ్యాధులకు గురైనవారు కోవిడ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. సాధారణ జలుబును వ్యాపించే కరోనావైరస్ బారిన పడినవారికి కోవిడ్19 సోకినా, వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారు. కానీ వారికి సార్స్ కోవ్ 2 సోకకుండా వారి రోగనిరోధక వ్యవస్థ కాపాడలేకపోయిందని పరిశోధకులు వెల్లడించారు.
Published by: Sumanth Kanukula
First published: October 8, 2020, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading