Home /News /coronavirus-latest-news /

PEOPLE WHO TRAVELLING TO ENGLAND WILL SOON EXCLUDED FROM TAKING COVID 19 TESTS AK

ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి ఆ కష్టాలు తీరినట్టే..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

England: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు దేశంలోకి వచ్చిన తరువాత పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు

    కరోనా కారణంగా విలవిల్లాడిన ఇంగ్లండ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఒమిక్రాన్ కల్లోలం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారికి అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తిస్థాయిలో కరోనా టీకాలు వేసుకున్న ప్రయాణీకులు దేశంలో ప్రవేశించినప్పుడు వారికి ఎలాంటి కరోనా పరీక్షలు లేకుండా మినహాయింపు ఇస్తామని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం వెల్లడించారు. త్వరలోనే ఇది అమలులోకి రానుందని తెలుస్తోంది. బకింగ్‌హామ్‌షైర్‌లోని మిల్టన్ కీన్స్‌లోని ఆసుపత్రిని సందర్శించిన తరువాత జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గడిచిన వారాంతంలో బ్రిటన్‌లో 74,799 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేవ్ నుంచి ఇంగ్లండ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని.. దేశంలోకి వచ్చే ప్రయాణీకులపై విధించే ఆంక్షల్లో మార్పులు చేస్తామని అన్నారు.

    రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు దేశంలోకి వచ్చిన తరువాత పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వారంలోనే ఇది అమలులోకి వస్తుందని అన్నారు. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమ స్వాగతించింది. కనీసం రెండు డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి టెస్టులు నిర్వహించే విధానాన్ని ప్రభుత్వం ఆపాలని ఈ పరిశ్రమ కోరింది.

    అయితే భవిష్యత్తులో బూస్టర్ డోసు కూడా తీసుకున్న వారికి ఈ పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగా బయలుదేరే ముందు పరీక్షలు చేయించుకోవడంతోపాటు రెండు పోస్ట్-అరైవల్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు వాళ్లు 10 రోజుల పాటు స్వీయ-ఐసోలేషన్‌లో ఉండాలి.

    Pak PM: ‘నన్ను పదవి నుంచి దించేయాలని చూస్తే మీకే రిస్కు’.. విపక్షాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక..

    Sperm Smuggling: 15 ఏళ్లుగా జైలులోనే భర్త.. నేరుగా కలవకుండానే 4పిల్లల్ని కన్న భార్య!

    గురువారం నుండి ఇంగ్లండ్ కఠినమైన ప్లాన్ బి పరిమితులు ముగిశాయి. దీని ప్రకారం ఇకపై పెద్ద వేదికలలోకి ప్రవేశించడానికి కోవిడ్ పాస్‌లుచ ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ఏమీ లేదు. ప్రజలు ఇకపై ఇంటి నుండి పని చేయమని కచ్చితంగా చెప్పలేరు. దేశంలో ఓమిక్రాన్ వేవ్ చాలావరకు పీక్స్‌కు చేరుకుందని నిర్ధారిస్తూ గత వారం పార్లమెంట్‌లో ఒక ప్రకటన కూడా చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: COVID-19 vaccine, England

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు