హైదరాబాద్ నుంచి వస్తే క్వారంటైన్.. తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్ర‌జ‌లు ఎవ‌రికి వారే జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్న మంత్రి ఎర్రబెల్లి.. అందరూ మాస్కులు ధ‌రించాల‌ని, స్వీయ నియంత్ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌, ప‌రిస‌రాల పారిశుద్ధ్యం పాటించాల‌ని చెప్పారు.

news18-telugu
Updated: July 7, 2020, 2:21 PM IST
హైదరాబాద్ నుంచి వస్తే క్వారంటైన్.. తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • Share this:
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.  కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.  ఇత‌ర రాష్ట్రాలు,  హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల నుంచి వ‌స్తున్న వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. అలాంటి వారిని హోం క్వారంటైన్ చేయాల‌ని అధికారులకు సూచించారు.  ప్ర‌జ‌లు ఎవ‌రికి వారే జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్న మంత్రి ఎర్రబెల్లి.. అందరూ  మాస్కులు ధ‌రించాల‌ని, స్వీయ నియంత్ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌, ప‌రిస‌రాల పారిశుద్ధ్యం పాటించాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా క‌ట్ట‌డికి పాటుప‌డాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల మండ‌లాల ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి సంబంధిత శాఖ‌ల జిల్లా, స్థానిక అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యుల‌తో పాల‌కుర్తి క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి రైతు వేదిక‌కు శంకుస్థాప‌న చేశారు. అలాగే తెలంగాణ‌కు 6వ విడ‌త హ‌రిత హారంలో భాగంగా క్యాంపు కార్యాల‌యంలో, గుట్ట చుట్టూ, రైతు వేదిక స్థ‌లం వ‌ద్ద మొక్క‌లు నాటారు.

క‌ల్లాలు, రైతు వేదిక‌ల ద‌ర‌ఖాస్తుల‌కు మ‌రో వారం రోజుల‌పాటు గ‌డ‌వు పెంచుతున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌క‌టించారు. జ‌న‌గామ జిల్లాలో ఈ ఏడాది 65ల‌క్ష‌ల 92వేల మొక్క‌ల లక్ష్యాన్ని సాధించాల‌ అధికారుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశించారు. ప‌ల్లెప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్రమాలు నిరంత‌రం నిర్వ‌హించాల‌ని, ఎట్టి ప‌రిస్ఙితుల్లోనూ ప్ర‌తి రోజూ పారిశుద్ధ్య ప‌నులు జ‌ర‌గాల‌ని మంత్రి ఆదేశించారు. నిర్ణీత రోజుల్లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేశామ‌ని ఊరుకోవ‌ద్ద‌న్నారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల వ‌ల్లే క‌రోనా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌ట్ట‌డిలో ఉంద‌న్నారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల‌, వివిధ శాఖ‌ల అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading