PEOPLE STANDING IN QUEUE FOR COVID TEST IN FRONT OF PRIVATE LABS IN HYDERABAD SK
వామ్మో.. కరోనా పరీక్షల కోసం భారీ క్యూ లైన్లు.. టోకెన్ తీసుకున్న వారానికి టెస్ట్
కరోనా టెస్ట్‌ల కోసం క్యూలైన్
టెస్ట్‌ల కోసం వచ్చే వారికి కరోనా ఉందో లేదో తెలియదు. కేవలం అనుమానంతోనే టెస్ట్‌లు చేయించుకునేందుకు వెళ్తున్నారు. ఐతే అంత మందిలో ఉంటే.. కరోనా ఉన్న వారి నుంచి. లేని వారికి సంక్రమించే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు దాదాపుగా వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జనాల్లో ఆందోళన మొదలయింది. తమకు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానపడుతున్నారు. ఎంతకైనా మంచిది టెస్ట్ చేయించుకుందామని.. ప్రైవేట్ ల్యాబ్స్ ముందు వాలిపోతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్ట్‌లు చేయడం లేదని.. డాక్టర్లు చుట్టూ తిరగాల్సి వస్తోందని.. ప్రైవేట్ ల్యాబ్స్‌కు వెళ్తున్నారు. జనాలు పెద్ద ఎత్తున టెస్ట్‌లకు ఎగపడుతుండడంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్, తిరుమలగిరిలో విజయా డయాగ్నొస్టిక్స్ ముందు టెస్టుల కోసం ఎంత మంది లైన్ కట్టారో ఈ వీడియోలో చూడండి.
ఉదయం 7 గంటలకే పరిస్థితి అలా ఉంది. వైన్ షాప్‌ల ముందు కనిపించినట్లుగా.. ఇప్పుడు ల్యాబ్స్ ముందు కూడా క్యూలు దర్శనమిస్తున్నాయి. జనాలు భారీ వస్తుండడంతో ప్రైవేట్ ల్యాబ్స్ కేవలం టోకెన్లు మాత్రమే ఇస్తున్నాయి. ఆ తర్వాత టోకెన్ నెంబర్ ఆధారంగా ఫోన్ చేసి టెస్ట్‌లకు పిలుస్తున్నారు. టోకెన్ తీసుకున్న వారం తర్వాత టెస్ట్‌లు చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు టెస్ట్‌ల కోసం వచ్చే వారికి కరోనా ఉందో లేదో తెలియదు. కేవలం అనుమానంతోనే టెస్ట్‌లు చేయించుకునేందుకు వెళ్తున్నారు. ఐతే అంత మందిలో ఉంటే.. కరోనా ఉన్న వారి నుంచి. లేని వారికి సంక్రమించే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ఆ రూల్స్ పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాసుల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ టెస్ట్‌లు చేస్తున్నట్లు ఇప్పటికే ఫిర్యాదు అందుతున్నాయి.
తెలంగాణలో ఇప్పటి వరకు 14,419 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,172 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 247 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 82,458 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ పరిధిలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.