హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

China: కరోనా అని అనుమానం వస్తే పెట్టేలో పెట్టేయడమే.. చైనాలో కఠిన చర్యలు

China: కరోనా అని అనుమానం వస్తే పెట్టేలో పెట్టేయడమే.. చైనాలో కఠిన చర్యలు

China: కరోనా కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు చైనా కూడా కొత్త ఆలోచనలు చేస్తోందని ఫోటోలు, వీడియోలను బట్టి అర్థమవుతోంది.

China: కరోనా కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు చైనా కూడా కొత్త ఆలోచనలు చేస్తోందని ఫోటోలు, వీడియోలను బట్టి అర్థమవుతోంది.

China: కరోనా కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు చైనా కూడా కొత్త ఆలోచనలు చేస్తోందని ఫోటోలు, వీడియోలను బట్టి అర్థమవుతోంది.

కరోనా పుట్టినిల్లు చైనాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అయితే ఈ వేరియంట్ వ్యాపించకుండా ఉండేందుకు డ్రాగన్ దేశం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా సోకిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారిని ఇరుకైన మెటల్ బాక్సులలో ఉండవలసిందిగా, ఒంటరిగా ఉండవలసిందిగా బలవంతం చేస్తున్నారని డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది. వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బీజింగ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చైనా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డాయి, చైనాలోని జియాన్, అన్యాంగ్, యుజౌలలో పరిస్థితి ఇదే విధంగా ఉందని ఆ పోస్టులు చెబుతున్నాయి. ఇక్కడ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన తరువాత ప్రజలను నిర్భందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ వీడియోల ఆధారంగా మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో చైనా కఠినంగా ఉంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు లేదా వృద్ధులు ఎవరైనా సరే.. వారి ప్రాంతంలో ఒక వ్యక్తి పాజిటివ్‌గా గుర్తిస్తే.. ప్రజలు కిక్కిరిసిన పెట్టెల్లో ఉండవలసి వస్తుందని డైలీ మెయిల్ పేర్కొంది. ఈ పెట్టెలు చెక్క మంచం, టాయిలెట్‌తో అమర్చబడి ఉంటాయి. ప్రజలు ఈ పరిమిత ప్రదేశాలలో రెండు వారాల పాటు ఉండవలసి ఉంటుంది.

తరచుగా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలు వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని.. తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని చెబుతుంటారు. మరోవైపు చైనా క్రూరమైన నియమాలు తరచుగా విమర్శలకు గురవుతుంటాయి. ఇటీవల కరోనావైరస్ లాక్‌డౌన్ పరిమితుల కారణంగా జియాన్ ఆసుపత్రిలో ప్రవేశం నిరాకరించబడిన గర్భిణీ స్త్రీ తన బిడ్డను కోల్పోయింది.

Indian Army Chief: చైనాతో యుద్ధం వస్తే భారత్‌దే గెలుపు.. ఆర్మీ ఛీఫ్ తాజా ప్రకటన..

Israel Weapons: డ్రోన్ కిల్లర్ స్మాష్ డ్రాగన్‌ను ఆవిష్కరించిన ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్ కు దీని ఉపయోగం ఏంటి..?

ఆమెకు ప్రవేశం నిరాకరించబడటానికి అసలు కారణం.. ఆమె కోవిడ్ నెగెటివ్ పరీక్ష ఫలితం నాలుగు గంటలు పాతది కావడమే. మొత్తానికి కరోనా కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు చైనా కూడా కొత్త ఆలోచనలు చేస్తోందని ఫోటోలు, వీడియోలను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ విషయంలో మరీ ఇంత కఠినంగా వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

First published:

Tags: China