Home /News /coronavirus-latest-news /

PEOPLE BEING TREATED WORSE THAN ANIMALS SAYS SC ON HORRENDOUS DELHI CRISIS SLAMS DROP IN TESTING SK

కరోనా రోగులు పశువుల కంటే హీనమా.. టెస్ట్‌లు చేయరా? సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లను పశవుల కంటే హీనంగా చూస్తున్నారని.. మృతదేహాలు చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయని మండిపడింది. మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ వాపోయారు.

    భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజుకు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత భయంకరంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. కరోనా రోగులకు చికిత్స, పరీక్షల తీరు, అంత్యక్రియ నిర్వహణపై శుక్రవారం సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లను పశవుల కంటే హీనంగా చూస్తున్నారని.. మృతదేహాలు చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయని మండిపడింది. మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ వాపోయారు. ఢిల్లీలో పరిస్థితితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    అంతేకాదు ఢిల్లీలో కరోనా పరీక్షలు తగ్గడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వచ్చిన ప్రారంభంలో కరోనా పరీక్షల చేయడంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నదని.. కానీ ఆ తర్వాత క్రమంగా టెస్ట్‌ల సంఖ్య తగ్గిందని వెల్లడించింది. గతంలో 7వేలకు పైగా టెస్ట్‌లు చేసే వారని.. కానీ ఇప్పుడు 5వేలు కూడా దాటటం లేదని నిలదీసింది. ముంబై, చెన్నై నగరాల కంటే తక్కువ పరీక్షలు చేస్తున్నారని మండిపడింది సుప్రీంకోర్టు. కేసుల పెరిగికొద్దీ టెస్ట్‌ల సంఖ్య కూడా పెరగాలని.. కానీ ఢిల్లీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చివాట్లు పెట్టింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

    అంతేకాదు కరోనా వైరస్‌తో రోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కథనాలు చూస్తే దేశంలో పరిస్థితుల ఎంత దిగజారోయో అర్థం చేసుకోవచ్చని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. మరి సుప్రీంకోర్టు నోటీసులపై ఆయా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona, Coronavirus, Covid-19, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు