news18-telugu
Updated: March 31, 2020, 6:52 AM IST
ప్రతీకాత్మక చిత్రం (TwitterPhoto)
ప్రపంచంలోనే సంపన్న దేశం.. ఆపద వస్తే ప్రపంచ దేశాలకు పెద్దన్న.. ఆ దేశంలో వైద్య సదుపాయాలకు లోటు లేదు.. కానీ, కరోనా మహమ్మారిని చూసి విలవిల్లాడుతోంది. వైరస్ సోకి రోగులు ఆస్పత్రికి వస్తే ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో డాక్టర్లు ఉండిపోతున్నారు. ఎవరికి వైద్యం చేయాలో తెలీక కళ్ల ముందే ప్రాణం పోతున్నా ఏమీ చేయలేక పోతున్నారు.. ఇదీ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి. అక్కడ కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోవడంతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయట. బతికే ఛాన్స్ ఉంటేనే సదరు రోగికి బెడ్ ఇచ్చి, వైద్యం అందిస్తున్నారట. ఇక.. న్యూయార్క్లో ప్రతి గంటకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి ఈ ఒక్క రాష్ట్రంలోనే కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపు 60వేలకు పెరిగింది. వెయ్యి మంది దాకా మరణించారు. ప్రస్తుతం ఆ దేశంలో 1,63,490 కరోనా కేసులు నమోదు కాగా, 3,148 మంది చనిపోయారు. నిన్న, ఈ రోజు కలిపి 928 మంది చనిపోయారు. ఎవరైనా కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వస్తే చాలు.. వారికి కరోనా పాజిటివ్ అని వచ్చేస్తోందట. ఇంకా ఇంకెంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయో తెలీని దుస్థితి.
అయినా.. అమెరికాను లాక్డౌన్ చేయడానికి ట్రంప్ సర్కారు భయపడుతోంది. ఆర్థికంగా న్యూయార్క్ నగరం కేంద్ర బిందువు కావడం వల్ల లాక్ డౌన్ విధిస్తే ఆర్థికంగా దెబ్బ పడుతుందన్న కారణంతో వెనకడుగు వేస్తోంది. మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. నిత్యావసరాల కోసం దుకాణాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. అటు.. న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాలకు కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఒక్క అమెరికాలోనే మొత్తం 2 లక్షల మంది ప్రాణాలకు ప్రమాదం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్టియెస్ డిసీజెస్ సంస్థ వెల్లడించింది. ఇదే విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ కూడా తేల్చి చెప్పింది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
March 31, 2020, 6:52 AM IST