హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఉపరాష్ట్రపతికి మరోసారి కరోనా పాజిటివ్.. వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలన్న పవన్‌ కల్యాణ్

ఉపరాష్ట్రపతికి మరోసారి కరోనా పాజిటివ్.. వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలన్న పవన్‌ కల్యాణ్

Photo Credit: Twitter

Photo Credit: Twitter

Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారినపడ్డారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు ప్రకటించారు. వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోని దేశ ప్రజలకు సేవ చేసేలా చూడమని దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు పవన్ కల్యాణ్.

ఇంకా చదవండి ...

కరోనా పంజా నుంచి వీవీఐపీలు కూడా తప్పించుకోలేకపోతున్నారు. ఫస్ట్ , సెకండ్‌ వేవ్‌లలో వణుకుపుట్టించిన వైరస్‌ థర్డ్‌వేవ్‌లో కూడా ప్రముఖుల్ని వదలడం లేదు. భారత ఉపరాష్ట్రపతి vice president of indiaవెంకయ్యనాయుడుvenkaiah naidu రెండో సారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఇవాళ పాజిటివ్‌positive గా రిపోర్ట్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌self oscillationలో ఉన్నారు. వారం రోజుల పాటు ఎవర్ని కలవ వద్దని సూచించారు. వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారినపడినట్లుగా తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు janasena party presidentపవన్‌ కల్యాణ్ Pawan Kalyan విచారణ వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా తెలిపారు పవన్ కల్యాణ్. వెంకయ్యనాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై దేశ ప్రజల సేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వెల్లడించారు జనసేనాధినేత. జనవరి 20న విశాఖపట్నంలో జరిగిన ఇండియన్‌ సైకియాట్రిక్ సొసైటీ 73వ వార్షిక జాతీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చీఫ్‌ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ తొలి స్నాతకోత్సవానికి హాజరైన మరుసటి రోజు వెంకయ్యనాయుడు హైదరాబాద్‌కు వచ్చారు.

వైస్ ప్రెసిడెంట్‌కి సెకండ్‌ టైమ్..

ఈ నెలాఖరులో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అప్పటిలోగా ఉపరాష్ట్రపతి కోవిడ్‌ నుంచి కోలుకొని సమావేశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తారని పార్లమెంట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందే పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా మొత్తం 875 మంది సభ్యులకు పాజిటివ్ అని తేలింది. రాజ్యసభ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో 271మంది వైరస్‌ బారినపడినట్లుగా తెలిసిందే.

ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.

— Vice President of India (@VPSecretariat) January 23, 2022

థర్డ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ బారినపడిన వాళ్లలో రాజకీయ ప్రముఖులతో పాటు చాలా మంది సినిమా కళాకారులు ఉన్నారు. సెలబ్రిటీలు మహమ్మారితో పోరాడుతున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంతో చాలా వరకూ థర్డ్‌వేవ్‌లో ముప్పు తప్పినట్లుగా తెలుస్తోంది.

First published:

Tags: Corona, Pawan kalyan, Venkaiah Naidu

ఉత్తమ కథలు