ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్...

PM CARES | పీఎం కేర్స్ ఖాతాకు పవన్ కళ్యాన్ రూ.కోటి విరాళాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు.

news18-telugu
Updated: April 3, 2020, 2:27 PM IST
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్...
ప్రధాన మంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం (File/Photo)
  • Share this:
Pawan Kalyan Donations | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ప్రకటించినట్టు పీఎంకేర్ సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణకు తాను ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి, ఏపీకి రూ.50లక్షలు, తెలంగాణకు మరో రూ.50లక్షలు విరాళంగా ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ మాట ప్రకారం పీఎంకేర్ ఫండ్‌కు రూ.కోటి విరాళాన్ని పంపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.కోటి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. విరాళం అందించిన వివరాలతో పాటు పవన్ కళ్యాణ్ ఓ సందేశాన్ని కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కరోనాపై యావత్ భారతదేశం చేస్తున్న పోరాటానికి మనవంతు ఆర్థిక చేయూతను అందిద్దాం. మరింత బలంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోరాడేందుకు ప్రధానికి చేయూతను అందించి నైతిక బాధ్యత నిర్వర్తిద్దాం.’ అని పవన్ కళ్యాణ్ కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా చెరో రూ.50 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేశారు పవన్ కళ్యాణ్.

కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో తమిళనాడులో కొందరు తెలుగు వారు చిక్కుకుపోయారు. వారిని కాపాడాలంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో ఆమె వెంటనే తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి తెలుగువారి గురించి వివరాలు సేకరించి వారిని ఆదుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను తమిళిసై ప్రశంసించారు. ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ ప్రేమ, నిబద్ధతను ఆమె కొనియాడారు. ఆమె ట్వీట్‌కు స్పందించిన పవన్ కళ్యాణ్ ‘మీలాంటి వారి ప్రోత్సాహం మరింతగా పేదల కోసం పాటుపడే శక్తినిస్తుంది.’ అని తమిళి సై సౌందర్ రాజన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.
First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading