ప్రధాని మోదీ బాటలో పవన్ కళ్యాణ్... 22న కీలక నిర్ణయం...

Pawan Kalyan | ఈ నెల 22 వ తేదీ ఆదివారం రోజు మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూ గా పాటిద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: March 20, 2020, 5:25 PM IST
ప్రధాని మోదీ బాటలో పవన్ కళ్యాణ్... 22న కీలక నిర్ణయం...
పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
Janata Curfew | కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను స్వాగతిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతిని ఉద్దేశించి మోదీ గారు చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని పవన్ కళ్యాన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 వ తేదీ ఆదివారం రోజు మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూ గా పాటిద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘ఆ రోజు (మార్చి 22) ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదామన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికిగాను ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రతీ ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం.’అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో చూసిన తన అనుభవాన్ని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. 2001 సెప్టెంబర్ 11 న ట్విన్ టవర్స్ ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, అది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేనూ పాలుపంచుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మోదీ పిలుపునకు దేశమంతా స్పదించాలని కోరారు. తాను సైతం ఆ రోజు జనతా కర్ఫ్యూ కార్యక్రమంలో పాల్గొంటూ.. ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రజల ముందుకు వస్తానని పవన్ చెప్పారు. కరోనాపై పోరాటంలో మన ధృడ చిత్తాన్ని చాటుకుందామన్నారు.
First published: March 20, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading