"Very Good" సీఎం జగన్‌ను అభినందించిన పవన్ కళ్యాణ్.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.

news18-telugu
Updated: July 3, 2020, 5:54 PM IST
పవన్ కళ్యాణ్, జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం 1088 ఆంబులెన్స్‌ లను ప్రారంభించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర భయంలో, ఆందోళనలో ఉన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో ఆంబులెన్స్‌ను ప్రారంభించడాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. ‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం - అభినందనీయం. అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం.’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే, ‘ఇది ప్రపంచానికే గడ్డు కాలం , అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ, రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలికి, సహకరిద్దాం - క్షేమంగా ఉందాం.’ అంటూ మరో ట్వీట్ చేశారు.

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్త 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 46 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16934కు చేరింది. వైరస్ కారణంగా ఒక్క రోజు వ్యవధిలో 9 మంది చనిపోయారు. మొత్తంగా ఏపీలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 206కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 9096 ఉండగా, వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7632కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38898 కరోనా పరీక్షలు చేయగా... రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 971611కు చేరింది..
Published by: Ashok Kumar Bonepalli
First published: July 3, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading