వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్.. పట్నా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు

వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్.. పట్నా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు

ప్రతీకాత్మక చిత్రం

మంగళవారం బీహార్‌లో 749 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బీహార్‌లో 13,274 మంది కరోరా బారినపడ్డారు. వీరిలో 104 మంది మరణించారు.

  • Share this:
    మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అన్ని ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఐతే పెరుగుతున్న కేసుల దృష్ట్యా బీహార్ రాజధాని పట్నాలో వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. జూలై 10 నుంచి 16 వరకు కఠినంగా లాక్‌డౌన్ చేయనున్నారు. ఈ మేరకు పట్నా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వారం రోజులు అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలుకు అనుమతిస్తారు.


    బీహార్‌లో మంగళవారం ఎప్పుడూ లేనంతా ఎక్కువ కేసులు నమోదయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం బీహార్‌లో 749 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బీహార్‌లో 13,274 మంది కరోరా బారినపడ్డారు. వీరిలో 104 మంది మరణించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: