Patanjali : కరోనా కాటుకు పతంజలి డైరీస్ అధినేత మృతి.. అల్లోపతిపై బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు

కోవిడ్ చికిత్స పొందుతూ పతంజలి డైరీస్ హెడ్ మృతి

పతంజలి డైరీస్ హెడ్ సునీల్ బన్సల్(57) మహమ్మారి కారణంగా చనిపోయారు. కరోనాకు ఆయన అల్లోపతి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చికిత్స ?

  • Share this:
కరోనా మహమ్మారి (Corona Pandemic) ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులను బలితీసుకుంది. తాజాగా పతంజలి డైరీస్ (Patanjali) హెడ్ సునీల్ బన్సల్(57) (Sunil Bansal) కూడా మహమ్మారి కారణంగా చనిపోయారు. కరోనాకు ఆయన అల్లోపతి చికిత్స (Allopathy Treatment) తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చికిత్స ఆయనను కాపాడటంలో ఎలాంటి పాత్ర పోషించలేదని పతంజలి కంపెనీ చెబుతోంది. రాజస్థాన్ జైపుర్ లోని ఓ ఆసుపత్రిలో మే19న సునీల్ చనిపోయినట్లు సంస్థ తెలిపింది. "కోవిడ్-19కు చికిత్స పొందుతున్న సునీల్ బన్సల్, రాజస్థాన్ ఆసుపత్రిలో చనిపోయారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. చికిత్స అంతా ఆమె ఆధ్వర్యంలోనే జరిగింది. పతంజలి అల్లోపతి చికిత్సలో ఎలాంటి పాత్ర పోషించలేదు. అయితే ఆయన ఆరోగ్యం గురించి మేము ఆందోళం చెందాం. పరిస్థితి గురించి ఆయన భార్యను అడిగి తెలుసుకున్నాం. కానీ ఫలితం లేకుండా పోయింది. శక్తిమంతమైన సహచరుని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం" అని పతంజలి డైరీస్ విభాగం ప్రకటన విడుదల చేసింది.

యోగా గురు బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థలో డైరీస్ విభాగం కూడా ఎంతో కీలకమైంది. 57 ఏళ్ల సునీల్ బన్సల్, 2018 జనవరిలో పతంజలి డైరీస్ అధినేతగా నియామితులయ్యారు. ఆయన డైరీస్ సైన్స్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో నియామకం అయిన వెంటనే ఆవు పాలు, ఇతర పాల ఉత్పత్తులను ప్యాకేజీ చేసే విక్రయించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో పెరుగు, మజ్జిగ, వెన్న లాంటి పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

Milkha Singh : ఐసీయూలో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్.. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు చెప్పిన వివరాలివే..!
 కోవిడ్-19 చికిత్సలో అల్లోపతి మందుల గురించి బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. ఇదే సమయంలో సునీల్ మరణించడంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆదివారం నాడు రామ్ దేవ్ బాబా తన వ్యాఖ్యలను బలవంతంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అల్లోపతి మందుల వల్లే లక్షల మంది చనిపోయారని తాను విన్నట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం వాడుతున్న మందులపై కూడా ఆయన ప్రశ్నించారు. ఫలితంగా వైద్య సంఘాల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. అనంతరం కేంద్ర ఆరోగ్యమంత్రి రంగంలోకి దిగి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రామ్ దేవ్ బాబాను కోరారు. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో బాబా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుక్కోవాల్సి వచ్చింది.
Published by:John Naveen Kora
First published: