Coronavirus: కరోనాపై పతంజలి రాందేవ్ బాబా యుద్ధం...

బాబా రాందేవ్ (File)

బాబా రామ్‌దేవ్‌ నాయకత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ ఇందుకోసం తన అలోవీరా, హల్దీ చందన్‌ సబ్బుల ధర ను 12.5 శాతం వరకు తగ్గించింది.

  • Share this:
    యోగా గురువు రాందేవ్ బాబా కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు  తమ వంతు కృషి చేసేందుకు ముందుకువచ్చాడు. బాబా రామ్‌దేవ్‌ నాయకత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ ఇందుకోసం తన అలోవీరా, హల్దీ చందన్‌ సబ్బుల ధర ను 12.5 శాతం వరకు తగ్గించింది. సామాన్య ప్రజలకు సహకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హిందుస్తాన్‌ యూనీలీవర్‌ (హెచ్‌యూఎల్‌) కూడా తన లైఫ్‌బాయ్‌ బ్రాండ్‌ సబ్బులు, వ్యక్తిత శుభ్రతకు తోడ్పడే హ్యాండ్‌వాష్‌, డోమెక్స్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ల ధర 15ు తగ్గించబోతున్నట్టు తెలిపింది. వచ్చే కొద్ది వారాల్లోనే ధరలు తగ్గించిన ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
    Published by:Krishna Adithya
    First published: