Buxar Railway Station: షాకింగ్ వీడియో.. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీసిన ప్రయాణికులు.. కారణమిదే..

Buxar Railway Station: షాకింగ్ వీడియో.. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీసిన ప్రయాణికులు.. కారణమిదే..

(Image-Twitter)

రైల్వే స్టేషన్‌ నుంచి ఒక్కసారిగా ప్రయాణికులు పెద్ద ఎత్తున బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో రైల్వే శాఖ అధికారులు ఆందోళన చెందారు.

  • Share this:
    రైల్వే స్టేషన్‌ నుంచి ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. కొందరు చేతిలో లగేజ్, మరికొందరు చేతుల్లో చిన్నారులతో పరుగులు తీశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. బయట నుంచి చూస్తున్నవారు రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. అయితే చివరకు తేలిందేమిటంటే.. కరోనా పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు రైల్వే స్టేషన్‌ నుంచి వేగంగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన బిహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరోగ్య సిబ్బంది తమకు ఎక్కడా కరోనా టెస్టులు చేస్తారేమో అన్న భయంతో రైలు దిగగానే వలస కార్మికులు ఉరుకులు పరుగుల మీద స్టేషన్‌ బయటకు వెళ్లిపోతున్నారు.

    కరోనా తీవ్రత అధికంగా ఉన్న ముంబై, పుణె, ఢిల్లీల నుంచి పెద్ద సంఖ్యలో వలసకార్మికులు వారి స్వస్థలాలకు బయలుదేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిహార్‌కు కూడా వేలాది సంఖ్యలో వలస కార్మికులు చేరుకుంటున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా వలస వెళ్లిన చోటు నుంచి స్వస్థలాలకు చేరుకునే రాష్ట్ర వాసులకు కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించడం కోసం ప్రతి రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లు చేసినట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.





    Indian Railways: రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త.. ఇలా చేస్తే మీ జేబుకు చిల్లే..

    అయితే ఇలా ప్రతి రోజు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రైలు దిగిన వలస కార్మికులు వెంటనే స్టేషన్ బయటకు పరుగులు పెడుతున్నారని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని భయంతో జనాలు ఈ విధంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘వలస కార్మికులు బయటకు వెళ్లకుండా ఆపితే.. వారు వాగ్వాదానికి దిగుతున్నారు. రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగినప్పుడు ఒక్క పోలీస్ కూడా అక్కడ లేరు’ అని ఓ హెల్త్ వర్కర్ తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు