భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ మొదలు పెట్టిన తర్వాత వీళ్లందరికీ కూడా మొదటి ప్రాధాన్యతలో టీకా వేసేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. అయితే, వారు ఎవరో కాదు. 2021లో జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లే వారు. ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సుమారు అర్ధశతాబ్దం తర్వాత జపాన్ ఒలింపిక్స్ నిర్వహిస్తోంది. 1964లో జపాన్ ఒలింపిక్స్ నిర్వహించింది. మళ్లీ ఇప్పుడు దక్కించుకుంది. 2020లోనే ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కానీ, కరోనాన వైరస్ కారణంగా అది 2021కి వాయిదా పడింది. ఒలింపిక్స్ చరిత్రలో క్రీడలు వాయిదా పడడం ఇదే తొలిసారి. దీంతో టోక్యోలో ఏర్పాట్లు అన్నీ వృధా అయ్యాయి. పూర్తి భద్రత మధ్య 2021లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2021 జూలై 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
కరోనా వ్యాక్సిన్ మీకు ఎప్పుడు వస్తుందో చెక్ చేసుకోండి
కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో నాకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ప్రజల్లో సందేహం నెలకొంది. ‘నాకు కరోనా వ్యాక్సిన్’ ఎప్పుడు వేస్తారు?’ అని మీకు అనుమానం ఉంటే దానికి సమాధానం తెలుసుకోండి. మీరు హెల్త్ వర్కర్ (డాక్టర్, నర్సులు, కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించే వారు) లేదా కరోనా వారియర్ అయితే మీకు తొలిదశలోనే కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది. మీరు పోలీసులా, ఆర్మ్డ్ సర్వీసెస్‌లో పనిచేస్తారా? మున్సిపల్ వర్కరా?, డ్రైవర్, టీచర్లా? అయితే మీకు ఆ తర్వాత ప్రాధాన్యం లభిస్తుంది. మీరు 50 ఏళ్ల కంటే పెద్దవారు అయితే, తదుపరి ప్రాధాన్యం మీకే ఇస్తారు. పై కేటగిరీలో కానివారు అయినా కూడా ఎవరికైనా ఆస్థమా, గుండెపోటు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వారికి కూడా ప్రాధాన్యతా క్రమంలో కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు కోవిడ్ 19 హాట్ స్పాట్ లో ఉండే వారు అయితే, మీకు టాప్ ప్రయారిటీలో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. పైన చెప్పిన వాటిలో ఏ కేటగిరీకి చెందని వారు అయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి, మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది.
అయితే, అసలు వ్యాక్సిన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే విషయంపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ప్రస్తుతం దేశంలో పలు రకాల వ్యాక్సిన్లు ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలో ఏ వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేదానిపై కూడా క్లారిటీ లేదు. కానీ, రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కేంద్రం నుంచి మార్గదర్శకాలు జారీ చేసింది.