Parliament Session: ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్... పార్లమెంటులో టెన్షన్

ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్... పార్లమెంటులో టెన్షన్

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరుగుతాయా అన్న డౌట్ తలెత్తుతోంది. ఎంపీలకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తోంది.

  • Share this:
    Parliament Monsoon Session 2020: ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవ్వగా... కొంత మంది ఎంపీలు కరోనా పాజిటివ్‌లుగా తేలుతున్నారు. ముఖ్యంగా... చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీళ్లకు కరోనా లక్షణాలు లేవు. అందువల్ల వీళ్లు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. పార్లమెంట్ దగ్గర నిర్వహించిన టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వాళ్లను ఐసోలేషన్‌కి పంపారు. ఇలా ఎంత మందికి కరోనా లక్షణాలు లేవో అన్న డౌట్ వస్తోంది. దేశంలో కరోనా సోకిన వారిలో 70 శాతం మంది అసింప్టమేటిక్ గా ఉంటున్నారు. వాళ్లలో లక్షణాలు కనిపించట్లేదు. అసలు కరోనా అనారోగ్యం ఉన్నట్లే వాళ్లకు తెలియట్లేదు. ఇదే సమస్యగా, సవాలుగా మారుతోంది.

    నేడు ఉదయం 9 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఇండియా-చైనా సరిహద్దు టెన్షన్లు, పడిపోయిన GDP వృద్ధి రేటు, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం, వలస కార్మికుల సమస్యలు, కరోనా వైరస్... వంటివి ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే కీలక అంశాలుగా మారాయి. ఈ సమావేశాలు 18 రోజుల పాటూ అంటే... అక్టోబర్ 1 వరకు ఇవి కొనసాగనున్నాయి. కరోనా కారణంగా... సోమవారం ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరుగుతుంది. అలాగే... మంగళవారం నుంచి ఉదయం 9 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి లోక్‌సభ జరుగుతాయి. ఈసారి... శని, ఆదివారం కూడా సభలుంటాయి. మొత్తం 12 బిల్లులు చర్చకు రానున్నాయి. అలాగే... ఈమధ్య జారీ చేసిన 11 ఆర్డినెన్సులు కూడా ఆమోదానికి వస్తాయి. అంతా బాగానే ఉన్న కరోనా టెన్షన్ తప్పట్లేదు. ఆల్రెడీ ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరు తేలారు. అందువల్ల మిగతా ఎంపీల్లో ఎవరికైనా వైరస్ సోకుతుందా అనే టెన్షన్ ఉంది.
    Published by:Krishna Kumar N
    First published: