Parle: పార్లేజీ సంస్థ పెద్దచేయి...పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదల కోసం...ఏం చేసిందంటే..

లాక్ డౌన్ సందర్భంగా 21 రోజుల పాటు పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవ్వనున్నారు. దీంతో వీరి ఆకలి బాధను తీర్చేందుకు ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ పార్లేజీ ముందుకు వచ్చింది. సుమారు 3 కోట్ల బిస్కెట్ పాకెట్లను ఉదారంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

news18-telugu
Updated: March 26, 2020, 9:25 AM IST
Parle: పార్లేజీ సంస్థ పెద్దచేయి...పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదల కోసం...ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ఫలితంగా, జాతియావత్తూ స్తంభించింది. దీంతో రోజువారీ కూలీలు, దినసరి వేతనంతో జీవించే బడుగు జీవులు ఉత్పత్తి రంగంతో పాటు సేవల రంగం స్తంభించడంతో ఆకలి బాధలకు లోనవుతున్నారు. కోట్లాదిమంది కూడు గూడు కోల్పోయారు. అయితే కరోనా కన్నా మందు వీరంతా ఆకలే పెద్ద ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, ఇతర పెద్ద పట్టణాల్లో నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించింది. ఫలితంగా కూలీలు, ఇతర అసంఘటిత కార్మికులు ఉపాధి లేక రోడ్డునపడ్డారు. ఫలితంగా వీరంతా లాక్ డౌన్ సందర్భంగా 21 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురవ్వనున్నారు. దీంతో వీరి ఆకలి బాధను తీర్చేందుకు ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ పార్లేజీ ముందుకు వచ్చింది. సుమారు 3 కోట్ల బిస్కెట్ పాకెట్లను ఉదారంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ బిస్కెట్లతో ఆకలితో ఉన్న పేదలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన తొంబై ఏండ్లుగా భారతీయుల ఇండ్లల్లో చోటు సంపాదించుకున్న ప్రముఖ బిస్కెట్‌ ఉత్పత్తుల సంస్థ పార్లే-జీ ప్రముఖ స్థానం సంపాదించుకుంది. 1929లో ఏర్పాటైన పార్లే-జీ.. బిస్కెట్‌ అమ్మకాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా 125 తయారీ సంస్థలున్నాయి.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు