బస్సులో ఉండగా 'కరోనా పాజిటివ్' అని ఫోన్.. ప్రయాణికుల పరుగులు

దంపతులు ఫోన్ కాల్ గురించి మాట్లాడుకుంటుండగా.. తోటి ప్రయాణికులు విని ఆందోళనకు గురయ్యారు. బస్సును ఆపి, కిందకు దిగి పారిపోయారు.

news18-telugu
Updated: June 23, 2020, 5:53 PM IST
బస్సులో ఉండగా 'కరోనా పాజిటివ్' అని ఫోన్.. ప్రయాణికుల పరుగులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ కరోనా కాలంలో తుమ్మినా, దగ్గినా కష్టమే. పది మందిలో ఉన్నప్పుడు దగ్గితే.. ఏదో టెర్రరిస్టును చూసినట్లు చూస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కరోనాతో అంతటి దారుణ పరిస్థితులు వచ్చాయి. ఇక బస్సులో వెళ్తున్న సమయంలో తోటి ప్రయాణికుల్లో ఒకరికి కరోనా ఉందని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా..! ప్రయాణికులంతా భయంతో వణికిపోరూ..! తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు బస్సులో వెళ్తుండగా.. మార్గ మధ్యలో వైద్యాధికారులు ఫోన్ చేసి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అంతే.. ఆ మాటలు విన్న తోటి ప్రయాణికులు బస్సును ఆపి, పరుగులు పెట్టారు,

ఇద్దరు దంపతులు సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులు వచ్చే వరకు హోం క్వారంటైన్‌లో ఉండకుండా.. ప్రయాణాలు పెట్టుకున్నారు. పరీక్షలు చేసిన మరుసటి రోజే కడలూరు నుంచి నైవేలీ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. మార్గమధ్యలో వారికి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. నిన్న శాంపిల్స్ ఇచ్చి వెళ్లారు కదా.. రిపోర్టులు వచ్చాయి. కరోనా పాజిటివ్ అని తేలింది అని ఫోన్లో చెప్పారు. దంపతులు ఫోన్ కాల్ గురించి మాట్లాడుకుంటుండగా.. తోటి ప్రయాణికులు విని ఆందోళనకు గురయ్యారు. బస్సును ఆపి, కిందకు దిగి పారిపోయారు. అనంతరం కరోనా సోకిన దంపతులను అంబులెన్స్‌లో కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఆ తర్వాత వారు ప్రయాణించిన బస్సును రసాయనాలతో శానిటైట్ చేశారు.

కాగా, తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. సోమవారం రాష్ట్రంలో 1,358 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 37 మంది మరణించారు. తమిళనాడులో ఇప్పటి వరకు మొత్తం 62,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 34,112 మంది కోలుకోగా.. 794 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 27,178 యాక్టివ్ కేసులున్నాయి. మనదేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తమిళనాడులోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
First published: June 23, 2020, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading