లాక్‌డౌన్ వల్ల ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. కొందరు కన్న తల్లిదండ్రులకు దూరమైతే.. ఇంకొందరు పిల్లలను చూడలేకపోతున్నారు. కష్టమైనా..నష్టమైనా.. కరోనా భయంతో ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇక పిల్లలు విదేశాల్లో ఉంటున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒంటరిగా ఉంటూ లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఐతే అలాంటి వారికి పోలీసులు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఒంటరిగా ఉన్నామనే భావనను పోగొడుతూ.. మేమున్నాం అని ధైర్యం నింపుతున్నారు. హర్యానాలోని పంచకులలో ఓ ఒంటరి వృద్ధుడికి పోలీసులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. నేరుగా ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో.. ఆయన ఉబ్బితిబ్బిపోయాడు. పోలీసులు వచ్చి తన బర్త్ డే చేయడంతో నోట మాటరాలేదు. భావోద్వేగానికి లోనై ఆనంద భాష్పాలు రాల్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండు రోజుల క్రితం ఆయన బంధువులు పోలీసులకు ట్వీట్ చేశారు. మంగళవారం బర్త్ డే ఉంటుందని..కానీ ఈసారి ఎవరూ లేకపోవడం వల్ల ఆయన జరుపుకోరని చెప్పారు. మా తరపున మీరు వెళ్లి బర్త్ డే జరపండని కోరారు. వారు కోరినట్లు పోలీసులు పెద్ద మనసుతో ఆయన ఇంటికెళ్లి పుట్టిన రోజు నిర్వహించారు. పోలీసుల మధ్య కేక్ కట్ చేయడంపై ఆ వృద్ధుడు హర్షం వ్యక్తం చేశారు. తన జీవితంతో దీన్ని మరచిపోలేని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH Panchkula Police surprise Karan Puri, a senior citizen in Sector 7, on his birthday, amid COVID19 lockdown. (Source: Panchkula Police) #Haryana pic.twitter.com/9DRC8qpsLU
— ANI (@ANI) April 28, 2020
ఇటీవల తెలంగాణలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళకు మల్కాజ్ గిరి పోలీసులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు ఇంటికి పాటలు పాడి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉన్న కుమారుడి కోరిక మేరకు.. వారి తరపున పుట్టిన రోజు వేడుక నిర్వహించారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Haryana, Lockdown