పాక్‌లో శనివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేత.. కేసులు పెరుగుతున్నా..

పాకిస్తాన్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,644కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 6,464 మంది కోలుకోగా..ఇప్పటివరకు 585 మంది చనిపోయారు.

news18-telugu
Updated: May 7, 2020, 10:46 PM IST
పాక్‌లో శనివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేత.. కేసులు పెరుగుతున్నా..
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్తాన్‌పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఐతే కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వేళ.. లాక్‌డౌన్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. గురువారం జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. శనివారం నుంచి క్రమంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పేదలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రస్తుతం పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను యథాతధంగా కొనసాగించలేమని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు మాకు తెలుసని.. కానీ తప్పడం లేదనన్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్‌లో అత్యధిక కేసులు నమోదైన గురువారం రోజే లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రకటన చేయడం గమనార్హం.

మరోవైపు గడిచిన 24 నాలుగు గంటల్లో పాకిస్తాన్‌లో కొత్తగా మరో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 41 మరణించారు. తాజా లెక్కల ప్రకారం.. పాకిస్తాన్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,644కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 6,464 మంది కోలుకోగా..ఇప్పటివరకు 585 మంది చనిపోయారు. ప్రస్తుతం అక్కడ 17,595 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 111 మంది పరిస్థితి విషమంగా ఉంది. పాక్‌లో నమోదవుతున్న కేసులో అత్యధికం సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోనే నమోదవుతున్నాయి.

First published: May 7, 2020, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading