పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు... ఎందుకంటే...

తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

news18-telugu
Updated: April 22, 2020, 2:03 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు... ఎందుకంటే...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను టెన్షన్ పెడుతోంది. ఏప్రిల్ 15 ఫైసల్ ఎది అనే వ్యక్తి కరోనా రిలీఫ్ ఫండ్‌కు పది మిలియన్ రూపాయల విరాళం అందించారు. ఈ మొతాన్ని చెక్ రూపంలో అందించేందుకు ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ఆయన భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య భేటీ ఏడు నిమిషాలు సాగింది. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే ఫైసల్ ఎదికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఫైసల్ ఎదితో సమావేశం కారణంగా ఇమ్రాన్ ఖాన్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.

imran khan,pm imran khan,imran khan latest news,pm imran khan speech,pm imran khan on coronavirus,imran khan corona virus,pm imran khan speech today,imran khan ko coronavirus ho geya,pm imran khan speech on coronavirus,pm imran khan on corona virus,pm imran khan coronavirus media talk,corona virus,imran khan corona virus negative,imran khan infected with the coronavirus,పాకిస్థాన్,కరోనా వైరస్,ఇమ్రాన్ ఖాన్
ఏప్రిల్ 15న ఇమ్రాన్ ఖాన్‌కు చెక్ అందించిన ఫైసల్ ఎది(Image: Twitter)


కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు సంబంధించి చెక్ ఇచ్చే సమయంలో అటు ఫైసల్ ఎది... ఇటు ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ చేతులకు ఎలాంటి గ్లౌజులు వేసుకోలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఇందుకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారని షౌకత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ హస్పిటల్ సీఈవో డాక్టర్ ఫైసల్ సుల్తాన్ తెలిపారు. ఈ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు ఇమ్రాన్ ఖాన్ నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కాగా, పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 9749కు చేరింది. 209 మంది కరోనా కారణంగా చనిపోయారు. 2156 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: April 22, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading