కరోనా వైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆయన tribune.com.pk వెబ్ సైట్ రాసిన ఓ కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు. భారత్‌లో లాక్ డౌన్ వల్ల 84 శాతం కుటుంబాల నెలసరి ఆదాయం తగ్గిపోయిందని ఆ కథనం హెడ్ లైన్. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, ముంబైకి చెందిన ఇండియన్ ఎకనమీ మానిటరింగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను ఆధారంగా పేర్కొంది. దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్ ‘ఈ నివేదిక ప్రకారం 34 శాతం మంది భారతీయ కుటుంబాలు సాయం అందించకపోతే వారానికి మించి బతకలేవు. ఇలాంటి సమయంలో భారత్‌కు సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నా. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన, పాకిస్తాన్ విజయవంతంగా, పారదర్శకంగా చేపట్టిన నగదు బదిలీ పథకాన్ని భారత్‌తో పంచుకునేందుకు రెడీగా ఉన్నా.’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్లో పాకిస్తాన్ ప్రభుత్వం రూ.120 బిలియన్లను 9 వారాల్లో 10 మిలియన్ల కుటుంబాలకు పంచిందని చెప్పారు. ఆ రకంగా కరోనా వేళ వారికి సాయం చేసిందని తెలిపారు.
Acc to this report, 34% of households across India will not be able to survive for more than a week without add assistance. I am ready to offer help & share our successful cash transfer prog, lauded internationally for its reach & transparency, with India.https://t.co/CcvUf6wERM