Home /News /coronavirus-latest-news /

PAKISTAN MEDIA PRAISES UP GOVTS HANDLING OF COVID 19 CRISIS

కరోనాపై పోరు..యోగీ ఆదిత్యనాథ్ సర్కార్‌కు పాక్ మీడియా ప్రశంసలు

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

Coronavirus Update | కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో యూపీ సర్కారు విజయం సాధించిందని పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ పత్రిక సంపాదకుడు ఫద్ హుస్సేన్ అభినందించారు.

    కరోనా సంక్షోభంపై పోరాటంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు పాక్ మీడియా నుంచి అనూహ్య  ప్రశంసలు లభించాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో యూపీ సర్కారు విజయం సాధించిందని పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ పత్రిక సంపాదకుడు ఫద్ హుస్సేన్ అభినందించారు. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆచరణనీయమంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారు. పాకిస్థాన్, యూపీలో కరోనా కేసులు, మరణాలు తదితర అంశాలను పోల్చుతూ సమగ్ర గణాంకాలతో కూడిన గ్రాఫ్‌ను ఆయన ట్వీట్ చేశారు.

    పాకిస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో జనాభా సంఖ్య దాదాపుగా సమానమని గుర్తు చేశారు. లాక్‌డౌన్ విషయంలో యూపీలోని ఆదిత్యనాథ్ సర్కారు చాలా కఠినంగా వ్యవహరించగా...పాక్ ప్రభుత్వం అలా వ్యవహరించలేకపోయిందని ఫద్ హుస్సేన్ తన కథనంలో గుర్తుచేశారు. యూపీ, పాక్ మధ్య భౌగోళిక, సామాజిక అంశాలు, అక్షరాస్యత విషయాల్లో సారూప్యత ఉన్నాయన్నారు. యూపీతో పోలిస్తే పాక్‌లో అంతమంది ఎందుకు చనిపోయారో తనకు ఎవరైనా వివరించే పక్షంలో వారిని తాను ఆహ్వానిస్తానన్నారు.

    ఆయన ట్వీట్ చేసిన గ్రాఫ్ మేరకు...పాకిస్థాన్‌ జనాభా 20.8 కోట్లు కాగా...యూపీలో 22.5 కోట్లుగా ఉంది. అయితే యూపీతో పోల్చితే పాకిస్థాన్‌లో కోవిడ్-19 మరణాలు ఏడింతలు ఎక్కువగా ఉన్నాయి. యూపీలో కోవిడ్-19 మరణాలు 275కాగా...పాకిస్థాన్‌లో 2002 మంది మరణించారు. అలాగే యూపీలో ఇప్పటి వరకు 10,619 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాగా...పాకిస్థాన్‌లో 98,943 కేసులు నిర్థారణ అయ్యాయని సదరు గ్రాఫ్‌లో గుర్తుచేశారు.



    అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో మహారాష్ట్ర విఫలం చెందిందని ఫద్ హుస్సేన్ మరో ట్వీట్ చేశారు. యూపీ చేసింది సబబు, మహారాష్ట్ర చేసింది సబబుకాదని గణాంకాలతో పోల్చుతూ...ఈ విషయంలో సరైన పాఠాలు నేర్వాలని పాక్ ప్రభుత్వానికి సూచించారు.

    Published by:Janardhan V
    First published:

    Tags: Coronavirus, Pakistan, Uttar pradesh, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు