కరోనా వ్యాప్తికి అమ్మాయిలే కారణమట.. ప్రధాని ముందే వివాదాస్పద వ్యాఖ్యలు..

కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలే కారణం అంటున్నాడో మత పెద్ద. వాళ్లు పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం వల్ల వైరస్ సోకిందని, వారి వల్లే పాకుతోందని మౌలానా తారీఖ్ జమీల్ అన్నాడు.

news18-telugu
Updated: April 27, 2020, 12:42 PM IST
కరోనా వ్యాప్తికి అమ్మాయిలే కారణమట.. ప్రధాని ముందే వివాదాస్పద వ్యాఖ్యలు..
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలే కారణం అంటున్నాడో మత పెద్ద. వాళ్లు పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం వల్ల వైరస్ సోకిందని, వారి వల్లే పాకుతోందని పాక్ మత పెద్ద మౌలానా తారీఖ్ జమీల్ అన్నాడు. ఆయన ఈ వ్యాఖ్యలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే అనడం సంచలనానికి దారి తీసింది. ఎసాహ్ టెలెథాన్ ఫండింగ్ సదస్సులో జమీల్, ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమీల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదానికి దారి తీశాయి. ఇప్పుడీ వ్యాఖ్యలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొందరికి కరోనాను అంటిపెట్టి మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని జమీల్ చెప్పడం గమనార్హం.

కాగా, పాకిస్తాన్‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 15 వేల మందికి పైగా కరోనా వ్యాధి బారిన పడ్డారు. సరైన వైద్య వసతులు లేకపోవడంతో వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు జంకుతున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 27, 2020, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading