కరోనాతో ఇల్లు కాలి పాకిస్థాన్ ఏడుస్తుంటే...అక్కడి ఆర్మీ జీతాలు పెంచాలంటూ డిమాండ్...

పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ప్రైవేట్ రంగ వ్యాపారాల్లో 100 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని 2016 సంవత్సరంలో ఒక నివేదిక తెలిపింది. దాని కమర్షియల్ వింగ్, షాహీన్ ఫౌండేషన్, రియల్ ఎస్టేట్ ఆస్తులు రూ .1.5 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: May 14, 2020, 8:21 AM IST
కరోనాతో ఇల్లు కాలి పాకిస్థాన్ ఏడుస్తుంటే...అక్కడి ఆర్మీ జీతాలు పెంచాలంటూ డిమాండ్...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఓవైపు కరోనావైరస్ పై ప్రపంచవ్యాప్తంగా దేశాలు పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఆర్మీ సిబ్బంది మాత్రం తమ జీతం 20 శాతం పెంచమంటూ 6,367 కోట్ల రూపాయల ప్యాకేజీని కోరింది. పాకిస్తాన్ కరెన్సీ క్షీణించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో జీతం పెంచాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల మధ్య పరిస్థితిని ఎదుర్కోవటానికి ఇబ్బంది పడుతున్నందున సైనికుల జీతం పెంచాలని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. బ్రిగేడియర్ ర్యాంక్ వరకు అధికారుల జీతాలను 5 శాతం, సైనికుల 10 శాతం పెంచుతామని ఆర్మీ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేసింది. పాకిస్తాన్ ప్రస్తుతం దారుణమైన ఆర్థిక పతనం దశలో ప్రయాణిస్తున్న సమయంలో దేశంలోనే సర్వశక్తివంతమైన వ్యవస్థగా మారిన పాకిస్తాన్ సైన్యం ఈ డిమాండ్ తెచ్చింది. ప్రస్తుత జీతంతో సైనికులు తమ ఇంటిని నడపలేకపోతున్నారని ఆర్మీ పేర్కొంది. అయితే అసలు సంగతి ఏమిటంటే ఆ దేశ బడ్జెట్ లో ఆర్మీకి తగినంత నిధులు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దేశం పట్ల బాధ్యతగా ఉండాల్సిన సైన్యాధికారులు ఇలాంటి డిమాండ్ చేయడంపై ఆ దేశ మేధావులు మండిపడుతున్నారు.

మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ప్రైవేట్ రంగ వ్యాపారాల్లో 100 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని 2016 సంవత్సరంలో ఒక నివేదిక తెలిపింది. దాని కమర్షియల్ వింగ్, షాహీన్ ఫౌండేషన్, రియల్ ఎస్టేట్ ఆస్తులు రూ .1.5 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆర్మీ వివిధ రంగాలైన బ్యాంకింగ్, ఫుడ్, రిటైల్, సూపర్ స్టోర్స్, సిమెంట్, రియల్ ఎస్టేట్, హౌసింగ్, కన్స్ట్రక్షన్, ఇన్సూరెన్స్ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ వంటి రంగాలలో కంపెనీలను నడుపుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు, చమురు వ్యాపారంలో కూడా ప్రవేశించాలనే ఆలోచనతో ఉంది. అయితే ప్రపంచంలోనే ఏ దేశం ఆర్మీ కూడా ఇలా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. పైగా పన్నుల రూపంలోకూడా పాకిస్థాన్ కు వాటాలు చాలా తక్కువగానే ఇస్తోంది. అయినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ నిధుల కొరత అంటూ ఏడుస్తోందని పాకిస్థాన్ లోని ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో 33,000 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. COVID-19 లాక్డౌన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే స్థితిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ లేదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్‌కు 163 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించగా, కరోనావైరస్ సంక్షోభం నుండి తలెత్తే పరిస్థితిని పరిష్కరించడానికి అమెరికా పాకిస్తాన్‌కు 8 మిలియన్ డాలర్ల సహాయం అందించింది. పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ప్రకారం, కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా పాకిస్తాన్ ఏప్రిల్ నెలలో సుమారు 11,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.
Published by: Krishna Adithya
First published: May 14, 2020, 8:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading