భారత్‌లోకి కరోనా పేషెంట్ల చొరబాటు.. పాకిస్తాన్ కొత్త కుట్ర

ఇటీవల ఓ ఆర్మీ ఉన్నతాధికారి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌లోకి కరోనా రోగులను చేరవేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని చెప్పారు.

news18-telugu
Updated: April 23, 2020, 5:37 PM IST
భారత్‌లోకి కరోనా పేషెంట్ల చొరబాటు.. పాకిస్తాన్ కొత్త కుట్ర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా కష్టాల్లో ఉంది. ఈ విపత్కర సమయంలో అన్ని దేశాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. కానీ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ మాత్రం కరోనా కేంద్రంగా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా జీవాయుధాన్ని భారత్‌పై ప్రయోగించేందుకు పావులు కుదుపుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. కరోనా వైరస్ బారినపడిన వ్యక్తులను భారత్‌లోకి తరలించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. కశ్మీర్ లోయలో ఈ తరహా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. గురువారం శ్రీనగర్‌కు 20 కి.మీ. దూరంలో ఉన్న గాందేర్‌బల్ జిల్లా క్వారంటైన్ సెంటర్‌ను ఆయన పరీశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు దిల్‌‌బాగ్.

భారత్‌లోకి కరోనా రోగులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందన్నది వాస్తవం. ఇంతకు ముందు కశ్మీర్‌కు ఉగ్రవాదులను పంపేవారు. కానీ ఇప్పుడు కరోనా రోగులను చేరవేస్తోంది. కశ్మీర్‌లో కరోనాను వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ కుట్ర చేస్తోంది. ముఖ్యంగా పీవోకే మీదుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మనమంతా అప్రమత్తంగా ఉండాలి.
దిల్‌బాగ్ సింగ్, జమ్మూకాశ్మీర్ డీజీపీఇటీవల ఓ ఆర్మీ ఉన్నతాధికారి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌లోకి కరోనా రోగులను చేరవేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రస్తుతం 50 మంది కరోనా రోగులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మీర్‌పూర్ జిల్లాలోనే ఉన్నారు. ఏప్రిల్ ఆరంభంలో కీరన్ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాట్లను భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. సైన్యం కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఐదుగురు జవాన్లు సైతం అమరవీరులయ్యారు.

కాగా, జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటి వరకు 407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 92 మంది కోలుకోగా.. ఐదుగురు మరణించారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో 310 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అటు లద్దాఖ్‌లో ఇప్పటి వరకు 18 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 14 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ 4 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇక పాకిస్తాన్‌లో 10,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 224 మంది మరణించారు.
First published: April 23, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading