Home /News /coronavirus-latest-news /

OXYGEN ATM IN NEW DELHI HERE IS THE DETAILS HOW TO GET FREE OXYGEN IN NATIONAL CAPITAL SK GH

Oxygen ATM: ‘ఆక్సిజన్ ఏటిఎం’.. కరోనా వేళ ఉచితంగా ప్రాణవాయువు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెడికల్​ ఆక్సిజన్ అవసరమున్న రోగులు తమ పేరు, ఆధార్​ కార్డ్ నంబర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ వివరాలను 9810083486 నంబర్​కు వాట్సాప్ ద్వారా మెసేజ్​ చేయాల్సి ఉంటుంది. మీ వివరాలను పరిశీలించి మెడికల్​ ఆక్సిజన్ అంజేస్తారు.​

దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విలయ తాండవం చేస్తోంది. కోవిడ్ ప్రభావం​ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది. ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల కొరత కారణంగా రోగులు పిట్లల్లా రాలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమకు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అవసరం ఉందని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా మోదీ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్రాల వైఖరితో రోగులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుసత్రుల్లో బెడ్లు ఖాళీగా లేక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కరోనా రోగులు హోమ్​ ఐసోలేషన్​లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటువంటి వారికి కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి ఆక్సిజన్​, మెడికల్​ కిట్లను అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నాయి.

తాజాగా హెల్పింగ్​ హ్యాండ్స్​ ఎన్​జీఓ నిర్వహిస్తున్న రాబిన్ హిబు తన టీంతో కలిసి ఆక్సిజన్​ ఏటీఎం ఏర్పాటు చేశాడు. హిబుతో పాటు కొంతమంది సిక్కు పౌరులు ఈ స్వచ్చంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏటీఎం ద్వారా ఆక్సిజన్ రీఫిలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాడు. రాబిన్​ హిబు బృందం ఈ ఆక్సిజన్​ ఏటీఎంను పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ వద్ద ఏర్పాటు చేసింది. మెడికల్​ ఆక్సిజన్ అవసరమున్న రోగులు తమ పేరు, ఆధార్​ కార్డ్ నంబర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ వివరాలను 9810083486 నంబర్​కు వాట్సాప్ ద్వారా మెసేజ్​ చేయాల్సి ఉంటుంది. మీ వివరాలను పరిశీలించి మెడికల్​ ఆక్సిజన్ అంజేస్తారు.​

కాగా, ఈ సర్వీసులపై హిబు మాట్లాడుతూ “రోగులకు 4 నుండి -5 రోజుల పాటు అవసరయ్యే మెడికల్​ ఆక్సిజన్​ను అందిస్తున్నాం. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే చిరుద్యోగులు, విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ ఆక్సిజన్​ ఏటీఎం ప్రారంభించిన తొమ్మిది రోజుల తరువాత, ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తమ సేవలు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున రోగుల కుటుంబ సభ్యులు ఇక్కడకు వస్తున్నారు.

అయితే, ఎక్కడా ఆక్సిజన్​ లభించకపోతే.. చివరి ప్రయత్నంగా మాత్రమే మమ్మల్ని సంప్రదించాలని వారిని కోరుతున్నాం. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద రోగుల కోసం ఈ సర్వీసులను ప్రారంభించాం.’’ అని ఆయన అన్నారు. కాగా, హెల్పింగ్ హ్యాండ్స్ సేవలను గుర్తించి.. దానికి మద్దతుగా ఒలింపియన్ బాక్సర్, రాజ్యసభ మెంబర్​ మేరీ కోమ్ రూ .3 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతేకాక, తన ఎంపీ లాడ్​ ఫండ్​ నుంచి మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. "ఈ ఆపత్కాలంలో ‘హెల్పింగ్​ హ్యాండ్స్’​ నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వారికి కావాల్సిన సహకారాన్ని అందజేస్తాను.’’ అని మేరీ కోమ్ అన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coronavirus, Covid-19, New Delhi, Oxygen, Oxygen beds, Oxygen plant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు