Corona Vaccine | ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్‌లో ముందడుగు... రెండో దశలోకి...

కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ పరీక్షల్లో ముందుడుగు పడింది.

news18-telugu
Updated: May 22, 2020, 8:12 PM IST
Corona Vaccine | ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్‌లో ముందడుగు... రెండో దశలోకి...
కోవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి వివక్షకు తావు ఉండబోదని, అన్నింటి కంటే ముందు ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ విభాగం అధిపతి మైక్‌ ర్యాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ పరీక్షల్లో ముందుడుగు పడింది. ప్రయోగాల్లో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని వర్సిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్రయోగాలు రెండో దశకు చేరుకున్నాయి. మొదటి దశ ఏప్రిల్‌లో మొదలు పెట్టింది. ఇందులో 1000 మంది మీద పరీక్షలు నిర్వహించారు. రెండో దశలో 10,260 మీద పరీక్షలు జరపనుంది. అందులో పెద్దలు, చిన్న పిల్లలు అధికం. 55 సంవత్సరాల వయసు పైబడిన వారు, 5 నుంచి 12 సంవత్సరాల లోపు వారి మీద రెండో దశలో పరీక్సలు నిర్వహిస్తారు. వారిలో రోగ నిరోధక శక్తి ఎలా పనిచేస్తుందో చెక్ చేస్తారు. ‘క్లినికల్ పరీక్షల్లో పురోగతి కనిపించింది. మేం మరో అడుగు ముందుకు వేస్తున్నాం. వివిధ వయస్సుల వారి మీద ఈ పరీక్షలు జరుగుతాయి. వారిలో ఎలా పనిచేస్తుందో చెక్ చేస్తా.’ అని ఆక్స్‌ఫర్డ్‌లో కరోనాకు విరుగుడు వ్యాక్సిన్ తయారు చేస్తున్న బృందం హెడ్ ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ChAdOx1 nCoV-19 పేరుతో వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది.

Published by: Ashok Kumar Bonepalli
First published: May 22, 2020, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading