హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: గుడ్ న్యూస్.. యూకేలో కొత్త వైరస్‌ను కూడా ఖతం చేసే మందు ఇదే

UK Virus: గుడ్ న్యూస్.. యూకేలో కొత్త వైరస్‌ను కూడా ఖతం చేసే మందు ఇదే

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర భారత ప్రభుత్వానికి రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని చెప్పింది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర భారత ప్రభుత్వానికి రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని చెప్పింది.

కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అయితే, కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది.

ఇంకా చదవండి ...

కరోనా వైరస్ (Coronavirus) తగ్గుముఖం పడుతున్న సమయంలో యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అయితే, కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం (Oxford University), ఆస్ట్రాజెనెకా(AstraZeneca) సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. దీని అన్ని టెస్టింగులు విజయవంతం కావడంతో ఇది కేవలం కరోనా వైరస్‌కే కాకుండా తాజాగా యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ కట్టడికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని యూకేలో ఒక ప్రముఖ మీడియా రిపోర్ట్ తెలిపింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India )తో ఒప్పందం కుదుర్చుకున్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ముందు యూకేలో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీన్ని ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు ఇప్పటికే కరోనాతో ఆసుపత్రిలో చేరిన 12 నుంచి 15 మిలియన్ల మందికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. COVID–19 న్యూ స్ట్రెయిన్ పాత వైరస్ను అధిగమించిందని, ఇది UKలో ప్రబలంగా వ్యాపిస్తుందని, దీని వ్యాప్తి వేగం 70 శాతం ఎక్కువగా ఉంటుందని నివేదిక హెచ్చరించింది. దీంతో బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) త్వరలోనే దీన్ని అందుబాటులోకి తేవడానికి ఆమోదముద్ర వేసింది.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ మరో వారం రోజుల్లో అందుబాటులోకి రావొచ్చని రిసెర్చ్ తెలిపింది. దీనిపై ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్, పాస్కల్ సోరియోట్ (Pascal Soriot) మాట్లాడుతూ “ఆక్స్ఫర్డ్ -యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇప్పటికే ఆమోదించబడిన ఫైజర్ (Pfizer), మోడెర్నా జబ్‌ (Moderna jabs)ల వలె సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది 95 శాతం మంది రోగులను రక్షించగలదు. ఇది కరోనా చికిత్సకు 100 శాతం ప్రభావవంతంగా పని చేస్తుంది.’’ అని ఆయన ఒక వార్తాపత్రికతో చెప్పారు.

100 మిలియన్ల టీకాలకు ఆర్డర్ చేసిన యూకే ప్రభుత్వం

COVID–19కు వ్యతిరేకంగా జరిగే యుద్ధాన్ని ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని UK ప్రభుత్వం భావిస్తోంది. ఫైజర్ డ్రగ్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చాల్సి ఉంటుంది. దీనికి 15 పౌండ్ల వరకు ఖర్చవుతుంది. అయితే, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ భద్రపర్చడానికి కేవలం 2 పౌండ్ల వరకు మాత్రమే ఖర్చవుతుంది. యూకెలో కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం 100 మిలియన్ల వ్యాక్సిన్‌ను ఆర్డర్ చేసింది. 2020 మార్చి చివరి నాటికి 40 మిలియన్ల మేర టీకాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కు రెగ్యులేటర్ ఆమోదం తెలిపిన వెంటనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి స్టేడియంలు, సమావేశ వేదికలను సిద్ధం చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య సేవ ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ల ద్వారా వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Corona Vaccine, COVID-19 vaccine, UK Virus

ఉత్తమ కథలు