హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

America Tour: అమెరికా వెళ్లేదెలా? చార్టర్ ఫ్లైట్సే దిక్కు.. విద్యార్థుల తల్లిదండ్రుల తిప్పలు

America Tour: అమెరికా వెళ్లేదెలా? చార్టర్ ఫ్లైట్సే దిక్కు.. విద్యార్థుల తల్లిదండ్రుల తిప్పలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మ‌న‌దేశంలో కొంద‌రు డ‌బ్బున్నవారు చార్టెడ్ విమానాల ద్వారా దుబాయ్‌కు వెళ్లి, అక్క‌డ కొన్నిరోజులు ఉండి.. ఆపైన అమెరికాకు వెళుతున్నారు. ఇక యూరప్‌ వాసులైతే ఈజిప్ట్‌ మీదుగా అమెరికా వెళ్తున్నారు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని ఉంద‌న్న‌ట్టుంది అమెరికాకు వెళ్లాల‌నుకునే విద్యార్థుల త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి. వీసాలున్నా కోవిడ్‌ ఆంక్ష‌లు కార‌ణంగా అమెరికాలో కాలుమోప‌లేని ప‌రిస్థితి నెలకొంది. అమెరికా విశ్వ‌విద్యాల‌యాల్లో అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో సీటు సంపాదించిన భార‌తీయ విద్యార్థుల‌ను వారి త‌ల్లిదండ్రులే ద‌గ్గ‌రుండి మ‌రీ పిల్ల‌ల‌ను కాంప‌స్‌ల‌లో జాయిన్ చేయిస్తుంటారు. అవ‌కాశం ఉంటే కొన్నిరోజులు అమెరికాలోనే గ‌డుపుతారు. త‌మ పిల్ల‌ల‌కు కొంచెం బెరుకుపోయి, అక్కడి వాతావరణ పరిస్థితులు అల‌వాటు అయ్యేవ‌ర‌కు ఉంటారు. ఆ తరువాతే తిరిగి ఇండియాకు రావ‌డ‌మ‌నేది స‌హ‌జంగా జ‌రుగుతున్న ప్రక్రియ‌.

అయితే కోవిడ్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో అమెరికా.. ఇతర దేశాల నుంచి రాక‌పోక‌ల‌ను నిషేధించింది. దీంతో వీసా ఉన్న విద్యార్థులకు తోడుగా త‌మ త‌ల్లిదండ్రులు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఈ ఆంక్షలతో  వారు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది అమెరికాకు రాక‌పోక‌లపై నిషేధం లేని దేశాలకు వెళ్తున్నారు. అక్క‌డ కొన్నిరోజులు గ‌డిపి, అనంతరం అమెరికాకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌న‌దేశంలో కొంద‌రు డ‌బ్బున్నవారు చార్టెడ్ విమానాల ద్వారా దుబాయ్‌కు వెళ్లి, అక్క‌డ కొన్నిరోజులు ఉండి.. ఆపైన అమెరికాకు వెళుతున్నారు. ఇక యూరప్‌ వాసులైతే ఈజిప్ట్‌ మీదుగా అమెరికా వెళ్తున్నారు. కొంద‌రు ర‌ష్యా నుంచి కూడా అగ్రరాజ్యానికి వెళ్లడానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

నిషేధం లేని దేశాల‌ నుంచి అమెరికాకు వెళ్లడం వ‌ల్ల నేరుగా నిషేధిత దేశం నుంచి వ‌చ్చిన‌ట్టు కాదు. అందువల్ల ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని వీరి భావ‌న‌. మ‌రోవైపు వీసా అపాయింట్‌మెంట్స్ విష‌యంలో భార‌త‌దేశంలో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. అమెరికా వీసా పోర్ట‌ల్స్ మొరాయిస్తుండ‌టంతో విద్యార్థులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీంతో డ‌య‌ల్ అప్ ప‌ద్ధ‌తిని ఎంచుకున్న‌వారికీ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. వీసా అపాయింట్ మెంట్ కోసం ఫోన్ చేసిన ఒక‌రికి దాదాపు గంట‌న్న‌ర‌సేపు వేచి ఉన్నాక అర‌గంట త‌రువాత వీసా పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంద‌ని స‌మాధానం ల‌భించింది.

అపాయింట్‌మెంట్ దొర‌క‌దేమోన‌ని భయపడుతున్న వారికి కాన్సులేట్ అధికారులు ధైర్యాన్నిచ్చే క‌బురు చెప్పారు. వేలాది అపాయింట్‌మెంట్స్ ఖాళీగా ఉన్నాయ‌ని, రాబోయే వారాల‌లో వీటి సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని చెప్పారు. వీసా క‌ష్టాలు తీరి.. భార‌తీయుల‌పై కోవిడ్ ఆంక్ష‌లు తొల‌గిపోతే అమెరికాకు వెళ్లే ఇండియ‌న్స్ సంబరానికి అంతే ఉండదు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, Coronavirus, Flight, Travel ban

ఉత్తమ కథలు