ఒకే గ్రామంలో 200 గబ్బిలాలు మృతి.. కరోనాతోనే చనిపోయాయా?

గబ్బిలాల కళేబరాలను ఐదారు ఫీట్ల లోతు గుంతలు తీసి వాటిలో పూడ్చిపెట్టారు. ఆ సమయంలో సిబ్బంది జాగ్రతలు తీసుకున్నారు. పీీపీఈ కిట్లు ధరించి, శానిటైజర్లను వాడి గబ్బిలాలను పూడ్చేశారు.

news18-telugu
Updated: May 27, 2020, 4:06 PM IST
ఒకే గ్రామంలో 200 గబ్బిలాలు మృతి.. కరోనాతోనే చనిపోయాయా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా భయంతో యావత్ దేశం వణికిపోతోంది. రోజు రోజుకూ వైరస్ విజృంభిస్తుండడతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బీహార్‌లోని ఓ గ్రామంలో ఏకంగా 200లకు పైగా గబ్బిలాలు చనిపోయాయి. భోజ్‌పూర్ జిల్లా తరారీ గ్రామంలో మూకుమ్మడిగా గబ్బిలాలు మృత్యువాతపడ్డాయి. దాంతో స్థానికులు భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా రాకముందు ఇవి చనిపోయి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు గబ్బిలాలే మూలమన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఒకేసారి ఇన్ని గబ్బిలాలు చనిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. మంగళవారం జిల్లా కేంద్రం నుంచి తరారీ గ్రామానికి ఆరుగురు సభ్యుల డాక్టర్ బృందాన్ని పంపించారు. గబ్బిలాల నుంచి స్వాబ్ శాంపిల్స్ తీసుకొని పట్నాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్‌కు పంపించారు. అనంతరం గబ్బిలాల కళేబరాలను ఐదారు ఫీట్ల లోతు గుంతలు తీసి వాటిలో పూడ్చిపెట్టారు. ఆ సమయంలో సిబ్బంది జాగ్రతలు తీసుకున్నారు. పీీపీఈ కిట్లు ధరించి, శానిటైజర్లను వాడి గబ్బిలాలను పూడ్చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రసాయనాలతో శానిటైజ్ చేశారు.

ఐతే దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల రోహిణి కార్తెలో ఎండలు ఎక్కవ అవడంతో ఇంట్లో ఉన్న మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఇక బయట తిరిగే గబ్బిలాలు ఎలా తట్టుకుంటాయని.. తాగేందుకు నీళ్లు లేక గబ్బిలాలు ఎండలో తిరిగి తిరిగి ప్రాణాలు విడిచి ఉంటాయని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి అసలు గబ్బిలాలు ఎలా చనిపోయాన్నది.. రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలుస్తుంది.
First published: May 27, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading