Children In USA : అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనివిధంగా రోజువారీ కేసులు,మరణాలు అగ్రరాజ్యంలో నమోదవుతున్నాయి. అయితే,అమెరికాలో చిన్నారులు కూడా భారీగా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కరోనా బారినపడినట్లు తాజాగా విడుదలైన లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోన్న ప్రస్తుత సమయంలో అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పిల్లలు కోవిడ్ బారినపడ్డారు.
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ యొక్క తాజా రిపోర్ట్ ప్రకారం... కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 20 వరకు అమెరికాలో 1 కోటి 6లక్షల మందికి పైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారు. అయితే అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసులలో..18.4 శాతం కేసులు పిల్లలవే అని సోమవారం రాత్రి విడుదల చేసిన ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. . ఒమిక్రాన్ వేరియంట్ ఉప్పెన సమయంలో పిల్లలలో కోవిడ్ -19 కేసులు అమెరికా వ్యాప్తంగా భారీగా పెరిగాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ALSO READ Viral Video : కారు గుద్దేసి వెళ్లినా కూడా..రిపోర్టింగ్ ఆపని జర్నలిస్ట్
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్(AAP)ప్రకారం.. గడిచిన వారం రోజుల్లో 11లక్షల మంది పిల్లల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత శీతాకాలపు ఉప్పెన(డెల్టా వేరియంట్ విజృంభణ సమయంలో) కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కేసులు పెరిగాయి. AAP ప్రకారం, వారం ముందు నివేదించబడిన 981,000 అదనపు కేసులతో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం పెరిగింది. రెండు వారాల ముందు నుండి కోవిడ్ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య రెట్టింపు అయింది. గత రెండు వారాల్లో 20 లక్షల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. సెప్టెంబరు మొదటి వారం నుండి.. 56 లక్షల మందికి పైగా పిల్లలు కరోనా బారిన పడినట్లు AAP రిపోర్ట్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Corona cases, Covid-19, USA