Covid 19: ఒప్పో ఫ్యాక్టరీలో కరోనా కలకలం... 3,000 మంది ఉద్యోగులకు పరీక్షలు

Covid 19 | కరోనా వైరస్ పరీక్షల్లో నెగిటీవ్ వచ్చిన ఉద్యోగులనే ఫ్యాక్టరీలోకి అనుమతించనుంది ఒప్పో. వారు విధుల్లో చేరిన తర్వాత కూడా కావాల్సిన భద్రతా చర్యలు తీసుకుటామంటోంది కంపెనీ.

news18-telugu
Updated: May 18, 2020, 11:59 AM IST
Covid 19: ఒప్పో ఫ్యాక్టరీలో కరోనా కలకలం... 3,000 మంది ఉద్యోగులకు పరీక్షలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో నోయిడా ఫ్యాక్టరీలో కరోనా వైరస్ కలకలం రేపింది. దీంతో కంపెనీ ఆ ఫ్యాక్టరీని మూసేసింది. ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న 3,000 మంది ఉద్యోగుల్ని కరోనా వైరస్ పరీక్షల కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాక్టరీని శుక్రవారం నాడే తెరిచింది ఒప్పో. కానీ ఆదివారం రోజు కరోనా వైరస్ కలకలం సృష్టించింది. విధుల్లో చేరిన ఉద్యోగులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి శాంపిల్స్ పంపించారు.

ఉద్యోగులు, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే గ్రేటర్ నోయిడాలోని యూనిట్‌లో కార్యకలాపాలను నిలిపివేశాం. 3,000 మంది ఉద్యోగులకు కోవిడ్ 19 పరీక్షల్ని జరిపిస్తున్నాం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. ఉద్యోగులను సురక్షితంగా ఉంచడానికి, ఫ్యాక్టరీ ఆవరణలో వైరస్ లేకుండా చేసేందుకు అన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాము.

ఒప్పో స్టేట్‌మెంట్


కరోనా వైరస్ పరీక్షల్లో నెగిటీవ్ వచ్చిన ఉద్యోగులనే ఫ్యాక్టరీలోకి అనుమతించనుంది ఒప్పో. వారు విధుల్లో చేరిన తర్వాత కూడా కావాల్సిన భద్రతా చర్యలు తీసుకుటామంటోంది కంపెనీ.

ఇవి కూడా చదవండి:

Jio New Plan: రోజూ 3 జీబీ డేటాతో జియో సరికొత్త ప్లాన్

BSNL WiFi: ఉచితంగా బీఎస్ఎన్ఎల్ వైఫై... కనెక్ట్ చేయండి ఇలాRedmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ
Published by: Santhosh Kumar S
First published: May 18, 2020, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading