లాక్ డౌన్‌పై ప్రధాని మోదీని విమర్శిస్తూ కమల్ ఘాటు లేఖ..

లాక్ డౌన్‌పై ప్రధాని మోదీని విమర్శిస్తూ కమల్ ఘాటు లేఖ..

కమల్ హాసన్, ప్రధాని మోదీ (Kamal Haasan Narendra Modi)

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రధాని విధించిన 21 రోజుల జాతీయ లాక్‌డౌన్‌ను విమర్శిస్తూ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మోదీకి ఓ బహిరంగ లేఖ రాశాడు.

  • Share this:
    కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రధాని విధించిన 21 రోజుల జాతీయ లాక్‌డౌన్‌ను విమర్శిస్తూ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ మోదీకి ఓ బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖలో ఆయన లాక్‌డౌన్ వల్ల బడుగులు, పేదవారు ఎంతగా నష్టపోతారో వివరిస్తూ.. ఈ లాక్ డౌన్ డిమానిటైజేషన్ కంటే తీవ్రంగా వారిని బాధిస్తుందని తెలిపారు. మీరేదో చెప్తారని అనుకుంటే బాల్కనీలో లైట్స్ వెలిగించాలీ.. దీపాలను ముట్టించాలనీ ప్రజల్నీ కోరుతున్నారు. దేశంలో చాలా మంది పొట్టకూడుకోసం ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ ఈ లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. వారికి కనీసం తిండికి గింజలు లేవు మీరేమో నూనెతో దీపాలను వెలిగించాలనీ కోరుతున్నారు. మీ నిర్ణయాలు ఎక్కువుగా మిడిల్ క్లాస్‌ను సంతోష పెట్టె విధంగానే ఉన్నాయి. కానీ ఈ ఆపత్కాలంలో పేదవాని సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి.. మన జిడిపిలో గానీ.. దేశ నిర్మాణంలో గానీ వారు చేస్తోన్న సహకారాన్ని విస్మరించలేము. దేశంలో మెజారిటీ వాటా వారిదే. అట్టుడగు స్థానంలో ఉన్న వారిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైనా అగ్రస్థానాన్ని పడగొట్టడానికి దారితీశాయని చరిత్ర రుజువు చేసింది.

    చైనాలో మొదటి కరోనా కేసు WHO అధికారిక ప్రకటన ప్రకారం డిసెంబర్ 8 న ధృవీకరించబడింది. మన దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30 న నమోదైంది. మీరు 1.4 బిలియన్ల మొత్తం దేశాన్ని 4 గంటల్లో మూసివేయమని ఆదేశించారు. మరీ 4 నెలల నుండి ఏం చేస్తున్నారు.. విజనరీ లీడర్ సమస్యలు పెద్దవి కావడానికి చాలా కాలం ముందే వాటికి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తారు. ఈ విషయంలో మీరు ఫేయిల్ అయ్యారని పేర్కోంటూ.. అందరిని కలుపుకొని పోవాలనీ ఈ విషయంలో మీతో పాటు మీము కూడా మీకు తోడుగా ఉంటామని కమల్ హాసన్ తన బహిరంగ లేఖలో తెలిపాడు.
    Published by:Suresh Rachamalla
    First published: