వాళ్లను మాత్రమే తరలించాలి... రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ క్లారిటీ...

వాళ్లను మాత్రమే తరలించాలి... రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ క్లారిటీ...

ప్రతీకాత్మక చిత్రం

ఎవరిని తరలించాలనే అంశంపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చింది.

  • Share this:
    ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకు ఎవరిని తరలించాలనే అంశంపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. అందులో ఎవరెవరిని తరలించాలనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘ఉద్యోగం పని మీదో, ఇతర పనుల మీదో ఎవరైతే తమ సొంత ఊరు లేదా, వర్క్ చేసే స్థలం నుంచి ఇతర రాష్ట్రాలకు, లాక్ డౌన్ విధించడానికి ముందు (మార్చి 24) వెళ్లి చిక్కుకుపోయారో వారిని మాత్రమే తరలించాలి. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి తరలింపు విషయంపై గతంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల ఉద్దేశం అది. అంతే కానీ, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో నివసిస్తున్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో వారిని ఉద్దేశించి కాదు. అలాగే, మామూలుగా సొంత రాష్ట్రానికి వెళ్దామనుకునే వారికోసం కూడా కాదు.’ అని ఆ లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తరలింపు చేయాలని స్పష్టం చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: