Home /News /coronavirus-latest-news /

Andhra Pradesh: సార్ మీ కాళ్లు మొక్కుతా అలా చేయండి.. కమిషనర్ కు లేఖ వెంటనే బలవన్మరణం

Andhra Pradesh: సార్ మీ కాళ్లు మొక్కుతా అలా చేయండి.. కమిషనర్ కు లేఖ వెంటనే బలవన్మరణం

పోలీస్ కమిషనర్ కు లేఖ రాసి బలన్మరణం

పోలీస్ కమిషనర్ కు లేఖ రాసి బలన్మరణం

కరోనా మనుషులను ఆర్థికంగా చిదిమేసింది. ఉద్యోగం పోయింది.. జీతం ఆగిపోయింది. దీంతో అప్పులు కుప్పలుగా జీవితం మారింది. ఆ బాధలు బరించలేక ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీ రాజధాని ప్రాంతంలో ఓ వ్యక్తి రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తోంది.

ఇంకా చదవండి ...
  కరోనా అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చాలామందికి కుటుంబ పోషణ భారంగా మారింది. కరోనా కాటు.. కర్ఫ్యూ.. లాక్ డౌన్ ల కారణంగా ఉన్న ఉపాధి పోయింది. ఉద్యోగం లేక.. జీతం రాక పస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఎందరిదో.. ముఖ్యంగా చిన్ని చిన్న వ్యాపార సంస్థలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్కూళ్లలో పని చేసే చిన్న ఉద్యోగుల పరిస్థితి భారంగా మారింది. ఆయా సంస్థలు మూతపడడంతో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందే పరిస్థిలి లేదు. కానీ అప్పటికే తీసుకున్న అప్పులు.. లోన్లకు కట్టాల్సిన ఈఎంఐలు, బయట అప్పులు ఇలా అతా కలిసి తడిపిమోపెడు అవుతోంది. దీంతో అప్పుల బాధ తాళలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ రాజధాని ప్రాంతం పెనమలూరులో జరిగిన ఘటన విషాదం నింపింది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి.. నేరుగా పోలీస్ కమీషనర్ కే లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు అందరితో కన్నీరు పెట్టిస్తోంది...

  ఆ లేఖలో ఏముందంటే.. పోలీస్‌ కమిషనర్‌ గారూ.. మీ పాదాలకు నపమస్కారం చేస్తా.. నా భార్య పిల్లలను దిక్కులేని వారిని చేసి వెళ్లిపోతున్నా.. తీర్చలేని అప్పులు, భారంగా మారిన వడ్డీలు నా కుటుంబాన్ని చిదిమేశాయి. వీటిని తట్టుకోలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా.. ఇక నుంచి నా భార్యకు వడ్డీలు కట్టే బాధ నుంచి విముక్తి కలిగించండి. నా దేహాన్ని బంధువులెవరికీ అప్పగించొద్దు. అనాథ శవం దొరికితే ఎలా దహనం చేస్తారో అలాగే నన్నూ దహనం చేయండి. ఇదే నా చివరి కోరికంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు..

  ఇదీ చదవండి: NDAలోకి వైసీపీ.. విజయసాయికి మంత్రి పదవి..! ఢిల్లీలో మారుతున్న రాజకీయం

  పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద కరకట్టపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 45 ఏళ్ల ఉద్దంటి సాయిబాబు విజయవాడ పటమటలంక పుట్ట రోడ్డులో నివసిస్తుంటాడు. అతను అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో జీతం కూడా సరిగ్గా అందడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అతనికి కొంతకాలంగా మానసికస్థితి బాగుండటం లేదు. తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒకటి రెండ్రోజుల తర్వాత తిరిగి వస్తుండేవాడు. ఈనెల 12న బీసెంట్‌ రోడ్డులోని తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. కానీ ఎప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో రాత్రి నుంచి కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. అయితే ఉదయం పెదపులిపాక దగ్గర కరకట్టపై చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతోందని గుర్తించిన కొందరు అతడి భార్య కృష్ణవేణికి చెప్పారు. ఆమె వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా.. అది తన భర్త సాయిబాబుదేనని గుర్తించింది.

  ఇదీ చదవండి: జాతీయ రాజకీయాల్లో మోదీకి వ్యతిరేక కూటమి.. ప్రశాంత్ కిషోర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా

  వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. మృతుడు సాయిబాబు రాసినట్టుగా అతడి చొక్కా జేబులో నగర పోలీస్‌ కమిషనర్‌కు రాసిన లేఖ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, AP News, Corona effect, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు