Home /News /coronavirus-latest-news /

ONE FAMILY LIVE ON TREE SLEEPING AND DINING ALL DOING ON TREE IN ANDHRA PRADESH NGS TPT

Andhra Pradesh: చెట్టుపైనే అతడి నివాసం.. తిండి, నిద్రా అక్కడే.. ఎందుకో తెలుసా?

చెట్టుపైనే నివాసం.. తిండ్రి, నిద్రా అక్కడే

చెట్టుపైనే నివాసం.. తిండ్రి, నిద్రా అక్కడే

చెట్టే అతడికి ఆవాసం.. అతడేకాదు ఆ కుటుంబం మొత్తం చెట్టమీద వేసుకున్న గుడారంలోనే ఉంటోంది. అక్కడే నిద్ర.. అక్కడ తిండి కూడా.. ఆ కుటుంబం ఎందుకిలా చేస్తోందో తెలుసా..?

    GT Hemanth Kumar, Tirupati Correspondent, News18

    పొలం పక్కన ఉండే చెట్టే అతడి నివాసం.. తిండి, నిద్ర కూడా అక్కడే. ఎందుకో తెలుసా.. చిత్తూరు జిల్లా పడమటి మండలంలో మారు మూలా పల్లెలోని ఓ కుటుంబ పరిస్థితి అది.. ఇక్కడ వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగించే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. అటు కర్ణాకట...ఇటు తమిళనాడు  సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం, తంబళ్లపల్లె, పలమనేరు ప్రాంతాల్లో కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. తమిళనాడు, కర్ణాటక అటవీ శాఖ అధికారుల అత్యుత్సహం వల్ల ప్రస్తుతం 80కి పైగా ఏనుగులు కౌండిన్య అటవీ ప్రాంతంలో తిష్ట వేసాయి. నీటికి కొరత లేకపోవడం.. వాటికి ఇష్టమైమ ఆహారం అభ్యం కావడమే కాకుండా.. తియ్యని వరి, జొన్న, టమాటో వంటి పొలాలు అటవీ సమీప ప్రాంతంలో వేయడం.. వాటిని ఏనుగులు ద్వంసం చేసి భుజించడం సర్వసాధారణంగా మారిపోయింది.

    ఏనుగులు గ్రామాలపైకి రావడం....పంటలపై దాడి చేయడం, రైతులపై కూడా దాడి చేస్తున్నా ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాగునే నమ్ముకున్న రైతులకు కన్నీటి గాధలే మిగిలిస్తున్నాయి. తరుచూ ఏనుగుల దాడులను అడ్డుకోవాలని పలమనేరు మండలం పెంగరగుంట పంచాయితీ చిన్నకుంట గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతు వినూత్నంగా ఆలోచించాడు.

    ఇదీ చదవండి: పురుషుడివని నిరూపించుకుంటేనే పెన్షన్... వృద్ధుడికి అధికారుల వింత కండిషన్

    నాగరాజుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. సంతాన పోషణకు 2 ఎకరాల్లో సాగుతో వచ్చే ఆదాయం ఆధారం. ఈ ఏడాది 1.10 లక్షలు వెచ్చించి.. వరిపంట పండించాడు. పొలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అర ఎకరా మేర పంటను ఏనుగులు ద్వంసం చేసాయి. మిగిలిన ఒకటిన్నర ఎకరాను కాపాడుకునేందుకు.. పొలం పక్కనే ఉన్న చింత చెట్టుపై కట్టెలతో గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు ఏనుగుల నుంచి పంటను కాపాడుకునేందుకు చుట్టూ విద్యుత్ దీప స్తంభాలను ఏర్పాటు చేసాడు. ఎక్కువ కాంతి ఉంటె.. ఆ కాంతికి బయపడి ఏనుగుల సంచారం తగ్గుతాయని భావించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను మాత్రమే పొలం దగ్గర ఉంటూ..  సూర్యుడు అస్తమించగానే  భార్యా, పిల్లలు, తన శునకంతో చెట్టుపై ఏర్పాటు చేసిన గుడారం పై చేరుకుంటాడు. ఆ గుడారంలో అందరూ నిద్రించిన.. తాను మాత్రం జాగారం చేస్తూ.. ఏనుగుల సంచారాన్ని కుక్క పసిగట్టగానే కుటుంబ సభ్యులతో అప్రమత్తమై చుట్టూ అమర్చిన లైట్లను వేసి అరుపులు వేయడంతో ఏనుగులు వెనుదిరుగుతున్నాయని నాగరాజు చెపుతున్నాడు.

    ఇదీ చదవండి:జులై 26 నుంచి ఏపీలో పది పరీక్షలు.. ఈ సారి ఎన్ని పేపర్లంటే..?

    ఓ ఒంటరి ఏనుగు మాత్రం వేటికి భయపడకుండా పంటపై దాడికి యత్నిస్తోందని.. దానిని టపాకాయల ద్వారా తరిమేస్తున్నామని చెప్పుకొచ్చాడు. కేవలం చింతచెట్టుపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడం వల్లే పంటను కాపాడుకోగలుతున్నాని తెలిపుతున్నాడు. ఏనుగులు పంటల పైకి వచ్చినప్పుడు చాల భయం వేసేదని.. దూరం నుంచే అరుపులు, టార్చ్ లైట్ వేసి తరిమేవారమని అన్నారు. చెట్టుపై గుడారం వేసుకోవడం ద్వారా ఏనుగుల దాడికి గురికాకుండా ఉన్నామని చెప్పాడు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chitoor, Corona effect

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు