దేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్ (Omicron) కేసులతోపాటు మరో మంచి వార్తను అందించనుందా..? త్వరలో కరోనా పూర్తిగా తగ్గిపోతుందా..? ఈ అంశాలపై శాస్త్రవేత్తలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) లో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఎంతో ఆశజనకమైన అంశాన్ని వెల్లడించారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ డెల్టా వేరియంట్‌కు సంబంధించిన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు. అయితే ఇది అందరిలో జరగడం లేదని అన్నారు. కరోనా రెండు డోసులు తీసుకొన్న వారిలో మాత్రమే ఇటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె అన్నారు. ఈ అంశం పలు అధ్యయనాల్లో వెల్లడైంది అన్నారు. వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో ఒమిక్రాన్ లక్షణాలు కనపడితే వారిలో ఇక డెల్టా వచ్చే అవకాశాలు బాగా తగ్గుతున్నాయని అన్నారు.
Omicron Symptoms: డెల్టాకు ఒమిక్రాన్‌కు తేడా ఏమిటీ.. ఒమిక్రాన్ అని ఎలా గుర్తుపట్టాలి!
కచ్చితంగా అందరూ టీకా రెండు డోసులు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. టీకా తీసుకొన్న వారికి ఒమిక్రాన్ సోకితే శరీరం డెల్టా వేరియంట్‌కు పూర్తిగా నిరోధించే రోగ నిరోధక శక్తిని పెంచుతుందిన ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకొన్న వారిలో రోగ నిరోధక శక్తి సామర్థ్యం పెరుగుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ లక్షణాలు అంతగా కనబడడం లేదని అధ్యయనంలో వెల్లడైంది.
డెల్టా (Delta) కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రమాద రహితం అనేది వాస్తవం. అందువల్ల ఒమిక్రాన్ సోకినవారిలో డెల్టా వేరింట్ను నిరోధించే శక్తి పెరుగుతున్నట్టు గుర్తించారు. అనంతరం డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ వ్యక్తిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదని అన్నారు.
కరోనా సమస్య తీరిపోయే అవకాశం..
ఈ ఏడాది చివరి నాటికి కరోనా కష్టాలు ముగియవచ్చని WHO పేర్కొంది. WHO ఎమర్జెన్సీ హెడ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ ఈ విషయం వెల్లడించారు. ఈ సంవత్సరం కరోనాపై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ముగియవచ్చు. అయితే పేద మరియు ధనిక దేశాల మధ్య వ్యాక్సిన్లు మరియు మందుల పంపిణీలో భారీ అసమానతలను మనం తొలగిస్తేనే ఇది సాధ్యమవతుందని అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అందరికీ వ్యాక్సిన్ అందిస్తే మరణాలు, ఆస్పత్రి చేరికలు భారీగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
2020లో డబ్ల్యూహెచ్ఓ కరోనాను వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ (Health Emergency)గా ప్రకటించింది. ఈ విషయాన్ని డాక్టర్ ర్యాన్ గుర్తు చేశారు. మనం ఇప్పుడు ఈ వైరస్‌ని ఎప్పటికీ తొలగించలేమని ఆయన తెలిపారు. ఎందుకంటే ఈ వైరస్ (Virus)లు ఇప్పుడు మన పర్యావరణ వ్యవస్థలో ఒక భాగమయ్యాయని ఆయన అన్నారు. అయితే మనం కొన్ని పనులు చేయగలిగితే ఈ కరోనా (Corona) సమస్యకు ముగింపు పలకవచ్చని అన్నారు. అందులో ప్రధమ పరిష్కారం జనాభాలో అధిక శాతం వ్యాక్సిన్లు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వ్యాక్సిన్ ద్వారా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా.. ఎవరూ మరణించరని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona Vaccine, Delta Variant, Omicron, Omicron corona variant, World Health Organisation