OMICRON VARIANT SILENT KILLER RECOVERY TAKES LONG BEEN 25 DAYS STILL SUFFERING TOLD CJI RAMANA MKS
Omicron: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్.. ఇంకా ఇబ్బంది పడుతున్నా: CJI Ramana వ్యాఖ్యలు
ఒమిక్రాన్ పై సీజేఐ రమణ
సుప్రీంకోర్టులో వర్చువల్ వాదనలకు ముగింపు పలకాలన్న ఓ లాయర్ అభ్యర్థపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ సైలెంట్ కిల్లర్ అని, వ్యాధి నుంచి బయటపడ్డా ఆరోగ్య కోలుకోడానికి చాలా సమయం పడుతోందని చెప్పారు.
వేర్వేరు వేరియంట్లతో విరుచుకుపడుతూ కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మహమ్మారి ధాటికి వ్యవస్థలన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు. భారత న్యాయవ్యవస్థలో అత్యున్నతమై సుప్రీంకోర్టులోనూ ఇంకా భౌతిక విచారణలు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. కొవిడ్ ప్రభావం తగ్గింది కాబట్టి ఇకనైనా వర్చువల్ వాదనలకు ముగింపు పలకాలన్న ఓ లాయర్ అభ్యర్థపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ సైలెంట్ కిల్లర్ అని, వ్యాధి నుంచి బయటపడ్డా ఆరోగ్య కోలుకోడానికి చాలా సమయం పడుతోందని జస్టిస్ రమణ అన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా సుప్రీంకోర్టులో రద్దయిన భౌతిక విచారణలు ఇటీవల పాక్షికంగా పున: ప్రారంభమైన సంగతిని గుర్తుచేస్తూ, ఇక పూర్తిస్థాయిలో సాధారణ కార్యకలాపాలకు మళ్లుదామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ లాయర్ వికాస్ సింగ్ సేజేఐను అభ్యర్థించారు. ఒమిక్రాన్ ఇప్పుడు వైరల్ జ్వరంగా మారిందని, లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని, ప్రజలు తొందరగా కోలుకుంటున్నారని వికాస్ సింగ్ గుర్తుచేశారు. దీనిపై..
ఒమిక్రాన్ గురించి లాయర్ వికాస్ సింగ్ చేసిన కామెంట్లపై సీజేఐ రమణ స్పందిస్తూ.. ఒమిక్రాన్ ను సైలెంట్ కిల్లర్ గా అభివర్ణించారు. ‘నాకు కూడా ఒమిక్రాన్ సోకి, నాలుగు రోజుల్లోనే తగ్గింది. కానీ ఇంకా నాలో దాని(ఒమిక్రాన్) ప్రభావం ఉంది. ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది. నాకు కరోనా తొలివేవ్ లోనూ కొవిడ్ సోకింది. అప్పుడు తొందరగా కోలుకున్న నేను.. ఇప్పుడు ఒమిక్రాన్ నుంచి మాత్రం త్వరగా కోలుకోలేకున్నా. ఒమిక్రాన్ సోకి 25 రోజులు గడుస్తున్నా ఇంకా వైరస్ అనంతర ప్రభావాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నా’అని సీజేఐ వ్యాఖ్యానించారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, బుధవారం నాటి లెక్కల్లో కొత్తగా 15 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయని సీజేఐ గుర్తుచేశారు. అయితే, వైరస్ పరిస్థితిని సమీక్షించి, పూర్తి స్థాయిలో భౌతిక విచారణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీజేఐ రమణ పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.