దేశంలో కరోనా కేసులు మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. అయితే అందులో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరగకుండా చూసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై స్పష్టత రాకపోవడంతో.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ వేరియంట్ కనిపించే అవకాశం ఉండటంతో.. మొదటగా ప్రభుత్వాలు వారిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. అయితే అలాంటివాళ్లలో కూడా మొదట్లో కరోనా వైరస్ కనిపించడం లేదు. అలా విదేశాల నుంచి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ రావడం.. అది ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్లితే.. 12 ఏళ్ల బాలిక నైజీరియా నుండి పింప్రి చించ్వాడ్కు తిరిగి వచ్చింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె పంటి నొప్పి పెరిగిపోయింది. ఇదే ఆమెకు కోవిడ్ ఉన్నట్టు గుర్తించేలా చేసింది. బాలికకు మాత్రమే కాదు.. ఆమె కుటుంబంలోని మరో ఐదుగురిలో కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించింది. వీరంతా నవంబర్ 24న భారత్‌కు తిరిగి వచ్చారు. బాలిక పంటి నొప్పికి చికిత్స అందించేందుకు ఆమె నుంచి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ కావాలని డాక్టర్ స్పష్టం చేశారు.
ఇందుకోసం పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు పాజిటివ్ వచ్చింది. ఆమె కుటుంబసభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరితో సన్నిహితంగా ఉన్న వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. కరోనా సోకి వాళ్లందరినీ జిజామాత ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలిక కుటుంబం విషయంలో నిబంధనలకు అనుగుణంగా నమూనాలను NIVకి పంపినట్లు అధికారులు తెలిపారు.
Omicron: ఒమిక్రాన్ దెబ్బకు ఇండియాలో కరోనా మూడో వేవ్! -WHO నిపుణులు ఏమన్నారంటే..
ఓమిక్రాన్‌కు పాజిటివ్ పరీక్షించిన కుటుంబ సభ్యులలో 18 నెలల చిన్నారి కూడా ఉందని తెలిపారు. అయితే వారికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. వారికి మల్టీవిటమిన్ల సాధారణ మోతాదు సూచించబడిందని అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటివరకు వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 40 దాటింది. ఒమిక్రాన్ సోకిన వారిని క్వారంటైన్లో ఉంచుతున్న అధికారులు.. వారిని కాంటాక్ట్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Omicron corona variant