Home /News /coronavirus-latest-news /

OMICRON UPDATES PM NARENDRA MODIS MEETING TO REVIEW COVID SITUATION TODAY AS INDIA TALLY SPIKES SK

Covid-19: కోవిడ్ థర్డ్ వేవ్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్‌పై సాయంత్రం కీలక ప్రకటన?

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

India Corona Third wave: ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయి? కట్టడి కోసం ఎలాంటి ఆంక్షలు విధించాలి? వ్యాక్సినేషన్‌ను ఎలా వేగవంతం చేయాలన్న దానిపై చర్చించనున్నారు.

    మన దేశంలో కరోనా మహమ్మారి (Covid-19 Pandemic) మళ్లీ విలయ తాండవం చేస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్‌ (Corona third wave in india)లో భయంకరంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వల్లే కరోనా మూడోదశ వ్యాప్తి చెందిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయింది. కరోనా కట్టడిపై సీరియస్‌గా దృష్టిసారించింది. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ (PM narendra modi review Meeting) కోవిడ్ పరిస్థితిపై కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. కరోనా థర్డ్ వేవ్ వైద్యఆరోగ్య, హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు నీతి ఆయోగ సభ్యులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 04.30 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయి? కట్టడి కోసం ఎలాంటి ఆంక్షలు విధించాలి? వ్యాక్సినేషన్‌ను ఎలా వేగవంతం చేయాలన్న దానిపై చర్చించనున్నారు.

    Corona Third Wave: ఆ జిల్లాలో థర్డ్ వేవ్ భయం.. ఒక్కరోజే ఇన్ని కేసులా..



    సమీక్ష అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. లాక్‌డౌన్‌ (India Lockdown)పై కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా..లాక్‌డౌన్ వైపు ఆలోచన చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలను కఠినతరం చేశాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లను మూసివేశాయి. వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి, ఆంక్షలపై పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.

    India Corona Updates: ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా.. ఇవాళ్టి బులెటిన్లో షాకింగ్ వివరాలు

    కాగా, భారత్‌లో కరోనా మూడో దశ వ్యాప్తి సునామీలో విరుచుకుపడుతోంది. బాధితుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా 40,863 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 327 మరణాలు నమోదయ్యాయి. శనివారం 15,63,566 మందికి కరోనా పరీక్షలు చేస్తే.. 1,59,632 మందికి పాజిటివ్ వచ్చింది. కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉంది. అంటే కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి 10 మందిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,55,28,004కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,44,53,603 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,83,790 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 5,90,611 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

    మన దేశంలో టెస్ట్ పాజిటివిటీ భారీగా పెరుగుతోంది. ఏకంగా 10 శాతానికి పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో 28.34 శాతానికి చేరింది. గోవాలో 20.36, మహారాష్ట్రలో 16 శాతం పాజిటివిటీ రేటు ఉంది. మహారాష్ట్రపై పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ కొత్తగా 41,434 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. ఢిల్లీలో 20,181 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో 18,802, కర్నాటకలో 8,906 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నిన్న 15.63 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం కరోనా పరీక్ష సంఖ్య 69 కోట్లకు చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 89.28 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 151.57 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు.

    గ్రాండ్‌గా కుక్క బర్త్ డే పార్టీ..వీడియో వైరల్‌ కావడంతో యజమానికి తప్పని తిప్పలు..

    మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కూడా విజృంభిస్తోంది. 27 రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,623 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,409 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ఏం చేయాలన్న దానిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, COVID-19 cases, Narendra modi, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు