హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron Tension: ఐర్లాండ్ నుంచి వచ్చాడు కరోనా పాజిటివ్ అని తేలింది..? ఐసోలేషన్ లో ఉండమంటే.. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు

Omicron Tension: ఐర్లాండ్ నుంచి వచ్చాడు కరోనా పాజిటివ్ అని తేలింది..? ఐసోలేషన్ లో ఉండమంటే.. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron Tension in Andhra Pradesh: ఐర్లాండ్ నుండి వచ్చాడు.. ఎయిర్ పోర్టులో పరీక్ష నుంచి తప్పించుకున్నాడు.. తిరుపతి వెళ్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నాడు.. తరువాత విజయనగరం వచ్చాడు.. పాజిటివ్ అని తేలింది.. అయినా జనంలో తిరిగేస్తున్నాడు..

ఇంకా చదవండి ...

Omicron Tension in Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను ఒమిక్రాన్ వేరియంట్  ( Omicron variant) భయపడుతోంది. గత కొన్ని రోజుల నుంచి  వివిధ దేశాల నుంచి దాదాపు 8 వేల మంది  ఆంధ్రప్రదేశ్ చిరునామాతో వచ్చారు. అయితే అందులో 3 వేల మంది మినహా మిగిలిన వారి ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదు. వారు ఎక్కడ ఉన్నారు.. అసలు ఏపీలో అడుగుపెట్టారా..? ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా అన్నది లెక్క తేలడం లేదు. ఆ టెన్షన్ అలా ఉంచితే..  తాజాగా అలా విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా  పాజిటివ్ (Corona Positive) నిర్ధారణ కావడం ఆందోళన పెంచుతోంది.

కరోనా పాజిటివ్ అని నిర్ధారించిన వారు కూడా హోం ఐసొలేషన్ లో ఉండకుండా బయట తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి ఇటీవల ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా (Vizianagaram District) శృంగవరపుకోట మండలానికి వచ్చాడు. అయితే ఆ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది అంటూ పుకార్లు ఉన్నాయి. ఎందుకంటే ఐర్లాండ్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగి కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా తిరుపతికి వెళ్లాడు. అక్కడ నుంచి నేరుగా తన అత్తగారి ఇల్లు అయిన ఎస్‌.కోటకు వచ్చాడు. అయితే ఆ వ్యక్తి అడ్రస్ ట్రేస్ చేసిన ముంబై ఎయిర్ పోర్టు అధికారలు.. ఆ వ్యక్తి పరీక్షలు చేయించుకోవలేదని ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తికి మూడు రోజుల కిందట కరోన పరీక్షలు చేశారు వైద్య సిబ్బంది. అతడికి పాజిటివ్ అని తేలింది. అయితే ఒమిక్రాన్ కి సంబంధించిన ఎలాంటి సింప్టమ్స్ లేవని నిర్ధారించారు.

ఇదీ చదవండి: శివయ్యకు ఐస్ క్రీంతో అభిషేకం.. చల్లని ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. ఎక్కడో తెలుసా

అతడికి సాధారణ కరోనానే నిర్ధారణ అయ్యిందని.. ఒమిక్రాన్ అని భయపడాల్సిన అవసరం లేదని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రమణ కుమారి వివరించారు. అయినా అతడికి కరోనా రావడంతో ఒమిక్రాన్ అయి ఉంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆ వ్యక్తిని హోం క్వారెంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా.. పట్టించుకోలేదు. అక్కడ నుంచి వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అక్కడ నుంచి విశాఖపట్నం జిల్లా మధురువాడ కూడా వెళినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఏపీలో అడుగుపెట్టిన ఒమిక్రాన్.. నిర్ధారించిన అధికారులు.. ఎక్కడంటే?

ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ ఉన్నా లేకున్నా.. విదేశాల నుంచి వచ్చాడు కాబట్టి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉండాలి. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరీక్షలు చేసుకోకుండా.. నేరుగా తిరుపతి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత కూడా ఇలా ఇతర ప్రాంతాలకు తిరుగుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత ఎవరూ ఇళ్లు దాటి బయటకు వెళ్లొద్దని పదే పదే అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొందరు ఆ మాటలను పెడ చెవిన పెట్టి సూపర్ స్పెడర్స్ గా మారుతున్నారు. మరోవైపు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Corona alert, Omicron corona variant, Vizianagaram

ఉత్తమ కథలు