Omicron Tension in Andhra Pradesh: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ (Omicron New variant) ఇప్పటికే భారత్ ను కూడా వెంటాడుతోంది. ఇఫ్పటికే దేశంలో 20కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలకు వ్యాప్తించే ప్రమాదం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ఒమిక్రాన్ కేసు నమోదైంది ఏమో అనే ఆందోళన పెరుగుతోంది. అతడి శాంపిల్స్ వస్తే కానీ నిర్ధారించలేం అంటున్నారు. అధికారులు. ఇటీవల విదేశాల నుంచి ఓ వ్యక్తి శ్రీకాకుళం (Srikakulam) వచ్చాడు. అయితే అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది..
విదేశాల నుంచి నేరుగా శ్రీకాకుళంలోని కాశిబుగ్గకు వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే లక్షణాలు చూస్తే ఒమిక్రాన్ అనే అనుమానులు కలుగుతున్నాయి. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు అది ఒమిక్రాన్ అని నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్య లేదు అంటున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆసపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి : వీళ్ల తెలివి మామ్మూలుగా లేదుగా.. పోలీసుల కన్ను కప్పేందుకు ఏం చేశారో చూడండి
మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ దాడి తప్పేలా లేదు. దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే క్లారిటీ రావడం లేదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశంతో పాటు ఇతర దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది.
ఇదీ చదవండి : రోడ్డుపై గర్భిణీ అవస్థలు.. చలించి పోయిన చిన్నారి.. ఏం చేసిందంటే..? వీడియోలో చూడండి
గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్ల కంటే సెకండ్ వేవ్‌లో భారత్‌లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron) వైరస్‌పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు చెబుతుండడం ఆందోళన పెంచుతోంది.
ఇదీ చదవండి : పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీకి ఎంత విరాళం ఇచ్చారంటే?
ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు అధికారికంగా నిర్ధారించకపోయినా.. విదేశాల నుంచి వేలల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వారు ఉన్నారు. అందులో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు ఉన్నారు. వారి పూర్తి రిపోర్టులు రావడానికి వారం రోజులపైనే పడుతోంది. దీంతో అసలు ఒమిక్రాన్ ఎంటర్ అయ్యిందా లేదా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. కానీ అధికారుల్లో మాత్రం భయం వీడడం లేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Corona alert, Omicron, Omicron corona variant, Srikakulam