హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron Tension: ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. కొత్తగా పది కేసులు..

Omicron Tension: ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. కొత్తగా పది కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్‌ కలకలం

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్‌ కలకలం

Omicron Tension in Andhra Pradesh: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు ఏపీని భయపెడుతోంది. తాజాగా ఏపీలో ఒకే రోజు పది ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16కి చేరాయి..

Omicron Tension in Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  (Omicron) పంజా విసురుతోంది..  కేవలం ఒక్క రోజే 10 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.   ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. ఒకేసారి పది ఒమిక్రాన్ కేసులు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా అలర్ట్ అయ్యింది.. అయితే వారికి ప్రైమరీ కాంటాక్ట్ సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిలో ముగ్గురువి కాంటాక్ట్ కేసులు అని గుర్తించారు.. ఏపీలో సామాజిక వ్యాప్తి ద్వారా నమోదైన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవే.  వీరికి సంబంధించిన వారి పూర్తి వివారాలపై ఆరా తీస్తున్నారు.. తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లా (East Godavari District)లో 3, అనంతపురం జిల్లా (Anantapuram District)లో  2,  కర్నూలు జిల్లా (Kurnool District)లో 2 కేసులు,  చిత్తూరు (Chitoor), గుంటూరు (Guntur),  పశ్చిమ గోదావరి (West Godavari District) జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యాయి.  దీంతో ఆయా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు..

తాజా కేసులను కువైట్, నైజైరీయా, సౌదీ, అమెరికాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. అయితే వీరితో ప్రైమరీ కాంటాక్టు లో ఉన్న ఉన్నవారిలో కొందరికి పాజిటివ్ వచ్చినా.. వారి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో సుమారు 100 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ ఉంది అన్నది తెలియడం లేదు.. కచ్చితంగా ఈ కేసులు సంఖ్య రెట్టింపు అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి : గర్భిణిని భుజంపై మోస్తూ నది దాటించిన భర్త.. ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు..

ఓవరాల్ గా కరోనా కేసులు తగ్గుతున్నా.. ఒమిక్రాన్ చేపకింద నీరులా విస్తరిస్తుండడం ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే  ఎనిమిదికిపైగా జిల్లాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఏపీలో  మళ్లీ మైక్రో కంటెయిన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి అలర్ట్ అయ్యింది.

ఇదీ చదవండి : టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే అది జరుగుతుందని వ్యాఖ్య

ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇదే సమయలో న్యూ ఇయర్ వేడుకులకు ప్రజలు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసులు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అవుతోంది. మళ్లీ ఏపీలో ఆంక్షలపై  ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. మరికాసేపట్లో దీనిపై కొత్త గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : పండుగముందు వలకు చిక్కిన భారీ పండుగప్ప.. మత్య్సకారుల పంట పండింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు

ఓ వైపు న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తూనే.. మరోవైపు మళ్లీ  రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సారి నైట్  కర్ఫ్యూలో కఠిన  ఆంక్షలు విధించాలని అధికారులు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల పేరుతో ఎవరైనా  ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు కూడా తిసుకునే విధంగా గైడ్ లైన్స్ ప్రకటించే అవకాశం ఉంది..

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు