ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా (corona) వైరస్ ఒమిక్రాన్ (omicron) వేరియంట్ నుంచి మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. దీనికి బీఏ.2 (BA.2) సబ్‌వేరియంట్‌గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందగలదని డాక్టర్లు పేర్కొంటున్నారు. డెన్మార్క్‌లో నిర్వహించిన ఒక సర్వేలో బీఏ.2 రకం వేరియంట్ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. బీఏ.2 రకం వ్యాప్తి రేటు 39 శాతంగా ఉంటే... దీని ఒరిజినల్ బీఏ.1 (ఒమిక్రాన్) వ్యాప్తి రేటు 29 శాతంగా ఉందని రీసెర్చ్‌లో తేలింది. డెన్మార్క్‌లో గతేడాది డెసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో 8,541 కరోనా శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రబలంగా ఉన్నట్లు తేలింది.
ఈ కొత్త రకం కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గత నెలలోనే హెచ్చరించింది. బీఏ.2 వేరియంట్‌ను భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు మరో 57 దేశాల్లో గుర్తించినట్లు, దీని వ్యాప్తి వేగంగా ఉన్నట్లు తన ప్రకటనలో తెలిపింది. ఇదే విషయాన్ని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UK Health Security Agency) గత శుక్రవారం తన ప్రకటనలో పేర్కొనడం విశేషం. అయితే ఒమిక్రాన్‌లానే ఇది కూడా అంత ప్రమాదకరం కాదని సమాచారం. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలాగే ఇది ప్రమాదకరం కాదని డాక్టర్లు పేర్కొంటుండటం ఊరటనిచ్చే అంశం. అయితే అజాగ్రత్తగా ఉండకూడదని వారు హెచ్చరిస్తున్నారు. స్వీయ రక్షణ ఎప్పుడూ మంచిదేనని వారు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒమిక్రాన్, దాని సబ్‌వేరింట్ల వల్ల కలిగే ప్రాణ నష్టం తక్కువగా ఉందని అందుకే త్వరగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
కరోనా ఎండమిక్‌పై సందేహాలు...
ఒమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం తక్కువగా ఉండటం... ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో ఈ ఏడాదితో కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటుందని పలు పరిశోధనలు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వల్ల ఇప్పుడు ఎండమిక్‌పై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఒమిక్రాన్ వల్ల ప్రజల్లో వచ్చిన ఇమ్యూనిటీ ఇతర వేరియంట్లను అడ్డుకునే స్థాయిలో లేదని తాజా పరిశోధనల్లో తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకొంటే వైరస్ నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చని వారు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్నవారిలో ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ (బీఏ.2) సోకో అవకాశం చాలా ఉన్నట్లు తేలింది. వ్యాక్సిన్ తీసుకోకపోతే కరోనా బారిన పడే అవకాశం అధికంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
రక్షణ కవచంగా బూస్టర్ డోస్ (Booster Dose)
కరోనా సోకి తగ్గిన వారిలో వచ్చే రోగ నిరోధక శక్తి (Immunity) బూస్టర్ వ్యాక్సిన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీలో కేవలం 1/3 (one-third)గా ఉందని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. దాంతో రెండు డోస్‌లు పూర్తయినవారు బూస్టర్ డోస్‌ను కూడా తీసుకోవల్సిందిగా వైద్యులు పేర్కొంటున్నారు. అమెరికా, యూరోప్ దేశాల్లో ఇప్పటికే చాలా మంది బూస్టర్ డోస్ తీసుకోగా... భారత్‌లో ఈ ఏడాది నుంచే ఆరంభమైంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు దేశంలో బూస్టర్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.