భారతదేశానికి కరోనా వైరస్ పీడ వదలడం లేదు. కేసులు పూర్తిగా తగ్గాయని ఊపిరిపీల్చుకునేలోపే..కొత్త వేరియంట్లు దండయాత్ర చేస్తున్నాయి. గత రెండు నెలలుగా కేసులుగా కేసుల సంఖ్య తగ్గి సమయంలోనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు భయపెడుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్(Omicron sub variant) బీఏ4వైరస్ తొలి కేసు తెలంగాణ(Telangana)లో నమోదవగా..రెండో కేసు తమిళనాడు(Tamil Nadu)లో గుర్తించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వైరస్ సోకిన వ్యక్తి చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని చెంగల్పట్టు(Changalpattu) జిల్లాలోని నవలూర్(Navalur)నివాసిగా గుర్తించినట్లు తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్( Public Health and Preventive Medicine)ప్రకటించింది.
మళ్లీ వైరస్ విజృంభణ..
చెన్నైలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసు నమోదైన వ్యక్తిలో లక్షణాలు లేకపోయినప్పటికి కోవిడ్-19 జీనోమ్ సీక్వెన్సింగ్ నెట్వర్క్ టెస్టుల్లో పాజిటివ్‌గా వచ్చిందని రిపోర్ట్ ద్వారా ప్రకటించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ4 కేసు నమోదవడంతో తమిళనాడు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైతే బాధిత వ్యక్తి ఉన్నాడో అతనితో కాంటాక్ట్ అయిన వాళ్లను గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
రూపం మార్చుకొని దండయాత్ర..
కరోనా (corona)వైరస్ పూర్తిగా దేశాన్ని వదిలిపోయినప్పటికి..ఏదో రూపంలో కొత్త వేరియెంట్(New variant)లు భారత్(India)లో పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ తొలి కేసు హైదరాబాద్(Hyderabad)లో నమోదైంది. బాధితుడి శాంపిల్స్ పరిశీలించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కరోనా B.A4(BA4)వేరియంట్‌గా వైరస్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఈతరహా వైరస్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈనెల 9వ తేదిన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ని గుర్తించారు. అతను తెలంగాణ, భారత్‌కి చెందిన వ్యక్తి కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
కొత్త వేరియంట్ కేసులు..
ఐఎస్బీ(ISB)లో గెస్ట్ లెక్చర్(Guest lecture)ఇచ్చేందుకు సౌతాఫ్రిక నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయడంతో బీఏ4 వేరియంట్ కరోనా తొలి కేసు బయటపడింది. సౌతాఫ్రికాలో ఈతరహా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో శాంపిల్స్‌ని జీనమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు అధికారులు. దాంతో అక్కడి పరీక్షల్లో ఇది కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్‌గా నిర్ధారణైనట్లు అధికారులు గుర్తించారు.వైరస్ సోకిన వ్యక్తి హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కాదు. కేవలం మూడ్రోజుల పాటు ఐఎస్బీలో గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు వచ్చినట్లుగా గుర్తించారు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అధికారులు. అయినప్పటికి అతని ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
భయపడాల్సిన పనిలేదంట..
కొత్తరకం కరోనా వైరస్ కేసు ఈనెల 9వ తేదిన నమోదైనప్పటికి పరీక్షల అనంతరం తాజాగా ఇది కరోనా బీఏ4వేరియంట్‌గా గుర్తించారు. దేశంలో ఇదే తొలి కేసుగా నిర్ధారించారు. ఈ కొత్తరకం వైరస్ మరిన్ని నగరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లుగా భారత పరిశోధన వైద్య మండలి అధికారులు భావిస్తున్నారు.కరోనా బారినపడిన వాళ్లతో పాటు రెండు డోసుల టీకా తీసుకున్న వారికి ఈ వైరస్ సోకుతున్నట్లుగా నిపుణులు తేల్చారు. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకారి కాదని వ్యాప్తి మాత్రం వేగంగా ఉంటుందని డబ్లూహెచ్‌వో టెక్నికల్ చీఫ్ మారియా వాన్ వెల్లడించారు. కొత్త వేరియంట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.