Home /News /coronavirus-latest-news /

OMICRON SLOWLY INCREASING CASES COUNTRIES WITHIN THE RANGE OF SANCTIONS EVK

Omicron: నెమ్మ‌దిగా పెరుగుతున్న కేసులు.. ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి దేశాలు

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Omicron Cases: ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెమ్మ‌దిగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల‌ ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్‌కేసులు బాగా పెరుగుతున్నాయి. ఆయా దేశాలు ముందు జాగ్ర‌త్త‌గా నెమ్మ‌దిగా ఆంక్ష‌లు విధిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెమ్మ‌దిగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల‌ ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్‌కేసులు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ న‌గ‌రంలో కొత్త కేసులు బయ‌ట‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే న్యూయార్క్ (New York) గ‌వ‌ర్న‌ర్ కాథి హోచుల్ కీల‌కమైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప‌ట్ట‌ణంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి మాస్క్ తప్ప నిసరి అనే ఆదేశాలను అమలు చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని హోచుల్ స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ 2020, న్యూయార్క్‌లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఆ తర్వా త టీకా తీసుకున్న వారికి మాస్క్ అవసరం లేదని 2021 జూన్‌లో ప్రకటించారు. తాజాగా కేసుల పెరుగుదలతో మరికొద్ది రోజులపాటు మాస్క్ తప్పనిసరి నిబంధనను అమలు చేయ‌నున్నారు.

  ఆంక్ష‌లు పొడ‌గిస్తున్న దేశాలు..
  - విదేశీయులు దేశం లోకి ప్రవేశిం చటం పై నిషేధం తో పాటు అం తర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆం క్షలను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్న ట్లు ఇజ్రాయెల్ (Israel) ప్రకటిం చిం ది. ఒమిక్రాన్ వేరియం ట్ వ్యా ప్తిని
  అడ్డుకునేం దుకే ఆం క్షలు పొడిగిం చినట్లు ప్రధాని నెఫ్తాలి బెన్నె ట్, ఆరోగ్య మం త్రి నిట్జాన్ హోరోవిట్జ్ తెలిపారు.

  International Travel: ఆ దేశాల నుంచి వ‌చ్చేవారికి ఊర‌ట‌.. వారు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ కోసం ఎదురు చూడక్కర్లేదు!


  - దక్షిణ కొరియా (South Korea)పై కొవిడ్ కేలు విప‌రీతంగా పెరుగుతున్నాయి. వ‌రుస‌గా ప్ర‌తీ రోజు 7,000 పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. కరోనా ప్రారంభం నుంచి ఇప్పుడే అత్యంత క‌ఠినమైన ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

  - ఇండియాలో ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్‌ వేవ్‌ (Corona Third Wave) రావడానికి ముందే దాని వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవడం రైల్వే అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది.

  AIIMS Jobs : ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.. వేత‌నం రూ.. 1,42,506.. అప్లికేష‌న్ ప్రాసెస్ ఇదే!


  - ఇండియాలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై ఇంకా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్‌, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్‌, న్యూజీల్యాండ్‌, జింబాబ్వే, ఇజ్రాయిల్‌, హాంగ్‌కాంగ్, ఘనా, టాంజానియా దేశాల నుంచి వ‌చ్చే వారిపై ఆంక్ష‌లు విధిస్తున్నారు.

  - అమెరికా (America)లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

  - అమెరికా కూడా కోవిడ్ 19 ఒమిక్రాన్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్ సహా ఏ దేశాల నుంచి వచ్చే వారైనా ఖచ్చితంగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ (Corona Negative Certificate) లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు చూపించాల‌ని స్ప‌ష్టం చేసింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Covid 19 restrictions, Covid rules, International, Omicron, Omicron corona variant

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు