OMICRON SIBLING BA 1 OMICRON NEW SIBLING VARIANT IN INDIA IS REPLACE DELTA INSACOG EVK
Omicron's Sibling BA.1: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియట్ బీఏ.1.. డెల్టాను మించిపోయింది!
ప్రతీకాత్మక చిత్రం
Omicron's Sibling BA.1 | ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు భారత్‌లోనూ డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే ఆందోళన కలిగించే అంశం ఇండియాలో ఒమిక్రాన్ మరో రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ.1గా గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ (Omicron) వేరియంట్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు భారత్‌లోనూ డెల్టా వేరియంట్ (Delta Variant) స్థానంలో ఒమిక్రాన్ భర్తీ చేసిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే ఆందోళన కలిగించే అంశం ఇండియాలో ఒమిక్రాన్ మరో రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కొత్త వేరియంట్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిపేరు ఒమిక్రాన్ బీఏ.1 (Omicron BA.1) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన భారతీయ వైరాలజిస్టులు BA.1 ఓమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కొన్ని ఇతర రాష్ట్రాల్లో, డెల్టా వేరియంట్ స్థానంలో ఒమిక్రాన్ వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన సెకండ్ వేవ్ (Second wave) కు డెల్టా వేరియంట్ కారణం. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ డెల్టా వేరియంట్కంటే ఐదు రెట్టువేగంగా వ్యాపిస్తోంది.
డెల్టా వేరియంట్ 100 రోజులకు ఒమిక్రాన్ 15 రోజులకు సమానంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం వైరాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఒమిక్రాన్ బీఏ.1 చాలా బలంగా వ్యాపిస్తుందిని అంటున్నారు.
ఇది భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (INSACOG) , వైరాలజిస్ట్ల ప్రకారం, ఒమిక్రాన్ BA.1 దాని వేగవంతమైన వృద్ధి ధోరణి కారణంగా చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే కరోనా వ్యాప్తిలో వ్యాధి లక్షణాలు తేలికగా ఉన్నా వేగంగా వ్యాపిస్తున్నాయి. వేగంగా ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. దీని ద్వారా లక్షణాలు తేలికగా ఉన్నా ఎక్కువ మందికి వ్యాపించడం ద్వారా వైద్య సేవల అవసరం ఎంతో పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
ఈవిషయాన్ని ఇండియన్ SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ లేదా ఇండియన్ SARS-CoV-2 జెనెటిక్స్ కన్సార్టియం (Indian SARS-CoV-2 Consortium on Genomics or Indian SARS-CoV-2 Genetics Consortiu) పేర్కొంది.
వేగంగా వ్యాప్తి..
బయోటెక్నాలజీ విభాగం మహారాష్ట్ర, కేరళతో సహా కొన్ని రాష్ట్రాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌తో వ్యవహరిస్తుంది. ఓమిక్రాన్లో 50 కంటే ఎక్కువ ఉత్పరివర్తనలు ఉన్నాయి. దీని మొదటి కేసు నవంబర్ 8 న దక్షిణాఫ్రికాలో కనుక్కొన్నారు. అప్పటి నుండి ఇది భారతదేశంతో సహా ప్రపంచమంతటా వ్యాపించింది. ఒమిక్రాన్ వంశం యొక్క విభజన శాస్త్రవేత్తలకు మరింత ఆసక్తిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు, ఎందుకంటే ఇది ఎపిడెమియాలజీని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీని గురించి సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.